ముచ్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితో తెలంగాణ బహుజన పోరాటం – 42 శాతం బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు అన్యాయం
తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలు, సేవలను పార్టీ రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి నేత స్పష్టం చేశారు. గత సంవత్సరం విచార కిరీటం పుస్తకం చదివిన సందర్భంగా, తాను అప్పట్లో బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ముచ్చర్ల సత్యనారాయణ వంటి ఉద్యమకారుల జయంతిని సామాజిక మాధ్యమాల్లో గుర్తు చేసుకున్నానని తెలిపారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారన్నది ముఖ్యం కాదని, తెలంగాణ ఫస్ట్ అనే విధానంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి గొప్పతనాన్ని గుర్తించాల్సిందేనని…

