అంత ఇంత గలీజ్ కాదు! నల్లగొండలో కాంగ్రెస్ పాలనలో వెలుగుచూసిన చిల్లర రాజకీయాల భయానక రూపం
రాజకీయం రోజురోజుకీ ఎంత దిగజారిందంటే, అది చూసి ప్రజాస్వామ్యానికే సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు రాజకీయ వ్యవస్థ ఎంత చిల్లర స్థాయికి పడిపోయిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా, నల్లగొండ నియోజకవర్గం, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికి వెళ్లిన యాదగిరి అనే వ్యక్తిపై అమానుషంగా దాడి…

