కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

