ఐబొమ్మ రవి అరెస్టుపై సంచలనం: కొత్త సైట్లు, డేటా లీక్ ముప్పు, సినిమా ఇండస్ట్రీ–ప్రజల మధ్య పెరిగిన చర్చ
ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంత ఊపిరిపీల్చింది. పైరసీ వెబ్‌సైట్‌లను మూసివేయించడంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైందనుకుంటున్న సమయంలో, నాలుగు రోజులు గడవకముందే మరో షాక్ ఎదురైంది. గురువారం “Ibomma One” అనే పేరుతో కొత్త వెబ్‌సైట్ ప్రత్యక్షమై మళ్లీ కలకలం రేపింది. కొత్త సైట్‌లో కొత్త సినిమాలు కనిపించగా, వాటిపై క్లిక్ చేస్తే Movierulz వంటి ఇతర పైరసీ ప్లాట్‌ఫాంలకు రీడైరెక్ట్ అవుతున్నదని సోషల్ మీడియాలో పెద్దగా హంగామా జరిగింది. అయితే, పోలీసులు…

