అమెరికా హెచ్1బి, హెచ్4 వీసాల తాత్కాలిక రద్దు: భారతీయులకు ప్రభావం
అమెరికాలో హెచ్1బి, హెచ్4 వీసాదారులకు షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం కొందరు విదేశీ ఉద్యోగులకు వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈమెయిల్ల ద్వారా సమాచారం పంపింది. ఈ నిర్ణయం భారతీయ ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్1బి, హెచ్4 వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను వాయిదా వేసిన…

