ట్రాఫిక్ చలాన్లలో రూ.2 కోట్ల క్యూఆర్ కోడ్ స్కాం? పోలీస్ శాఖలో కలకలం
ట్రాఫిక్ చలాన్ల వసూళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. వాహనదారుల నుంచి చలాన్లు వసూలు చేసే సమయంలో అధికారిక క్యూఆర్ కోడ్‌కు బదులుగా కొందరు ట్రాఫిక్ సిబ్బంది తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు చెందిన క్యూఆర్ కోడ్లను ఉపయోగించినట్లు సమాచారం. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన సొమ్ము సుమారు రెండు కోట్ల రూపాయల వరకు మళ్లినట్లు చర్చ జరుగుతోంది. సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుంచి…

