జూబ్లీహిల్స్ ఉపఎన్నికల చర్చలో నిరుద్యోగుల ఆవేదన – కాంగ్రెస్, బిఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులు తమ సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉద్యోగాలు, గ్యారంటీలు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అదే హామీలను విస్మరించడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసిందని అభిప్రాయపడ్డారు. “రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు…

