ఎన్నికల వ్యవహారంపై ఆగ్రహం… అధికారులపై అభ్యంతరాలు, దౌర్జన్య ఆరోపణలు

ఎన్నికల నిర్వహణలో అధికారుల వ్యవహారంపై కొందరు ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, చెప్పినా స్పందన లేకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏజెంట్ల వ్యవహారం, పోలింగ్ నిర్వహణ, చెక్‌లు, పర్యవేక్షణలో పారదర్శకత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు సమానంగా అమలు కావాలని, ప్రజల అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోవాలని స్థానికులు…

Read More

ఓటు హక్కు వినియోగించుకోండి… అభివృద్ధిని ప్రశ్నించే హక్కు కోల్పోకండి: పట్టణ ప్రజలకు పిలుపు

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని, దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయడాన్ని ఒక బాధ్యతగా భావిస్తూ తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వస్తారని పేర్కొన్నారు. “మేము ఓటు వేయకపోతే మేము చనిపోయినట్టే” అనే భావనతో గ్రామీణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు….

Read More

ఓటు కోసం అడవుల్లో కిలోమీటర్ల నడక – చెంచు గిరిజనుల ఎదుట పెద్ద సవాలు

పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే… నాగర్కర్నూల్ జిల్లాలోని చెంచు గిరిజనాల పరిస్థితి చూస్తే ఓటు హక్కు ఒక హక్కు కాదు, ఒక పరీక్షలా కనిపిస్తోంది. అమరాబాద్, పాదరలింగాల మండలాల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న దాదాపు 20 చెంచు పెంటల్లో రహదారి సౌకర్యం లేకపోవడంతో, ఓటర్లు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పల్లెల్లో చిన్న చిన్న రోడ్లు కూడా ఉండగా, ఇక్కడ ఓటు వేయడానికి 5 నుంచి 23 కిలోమీటర్ల వరకు అడవిలో నడవాల్సిందే….

Read More