ప్రజాభవన్ ముట్టడి ఉద్రిక్తతలు… మహిళల ఆందోళనల మధ్య బుర్కా వివాదం
హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద మహిళల భారీ నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలకు ఇచ్చిన సంక్షేమ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వం వహించారు. మహిళలకు నెలకు ₹2500 ఆర్థిక సహాయం, పెన్షన్ల పెంపు, స్కూటీలు, బంగారం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు….

