రీరిలీజ్ కు సిద్ధమైన వర్మ కల్ట్ క్లాసిక్ శివ..నవంబర్ 14న థియేటర్లలో..

                              కింగ్ నాగార్జున, రామ్ గోపాల వర్మ కలయికలో రూపొందిన కల్ట్ క్లాసిక్ శివ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు 4కె డాల్బీ ఆట్మాస్‌ వెర్షన్‌లో ఈనెల 14న తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది.

                               తెలుగు సినిమా అంటే శివకు ముందు ఆ తరువాత అని చెబుతారు. దర్శకుడు రామ్ గోపాల వర్మ తెలుగే కాదు, మొత్తం ఇండియన్ సినిమా దారినే మార్చేశారు శివతో. 1989లో వచ్చిన ఈ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన శివ ఇప్పుడు 4కె డాల్బీఆట్మాస్‌ వెర్షన్‌లో ఈనెల 14న తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న హైదరాబాద్ లో ఈ సినిమా Re-release trailer ను విడుదల చేశారు.

                               దీని తరువాత హీరో నాగార్జున మాట్లాడుతూ, 36ఏళ్ల క్రితం దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నాతో ఈ ‘శివ’ తీసి, నన్ను పెద్ద స్టార్‌ను చేశారు. తాజాగా ఈ సినిమా మళ్లీ చూశా. అద్భుతంగా అనిపించింది అని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ ఆరు నెలలు కష్టపడి, ప్రతి సౌండ్‌ ట్రాక్‌ని మళ్లీ ఒరిజినల్‌ సినిమా చేసినట్లుగా, అద్భుతంగా డిజైన్‌ చేశాడని, డాల్బీఅట్మాస్ లో అదిరిపోతుందని నాగార్జున అన్నారు. 36ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఇది, ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇలా ఒకే వేదికపై నిలబడి, రీ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేస్తూ, మాట్లాడతామని నేనెప్పుడూ ఊహించలేదని, దర్శకుడు రామ్ గోపాల వర్మ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *