హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు తీసుకొచ్చాయి. ఈ ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగింది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికల తర్వాత బయటకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. కానీ తాజా కేకే సర్వే రిపోర్ట్ మాత్రం పరిస్థితిని తారుమారుచేసింది. ఆ సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 49.5% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అంటే దాదాపు 8% మెజారిటీతో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నదని కేకే సర్వీస్ పేర్కొంది.
అయితే ఈ ఫలితాలపై కాంగ్రెస్ వర్గాలు, ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇరు పక్షాల నాయకులు పరస్పరం కంప్లైంట్లు ఇచ్చారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం, అలాగే అధికార పార్టీ నాయకులపై కూడా కేసులు నమోదయ్యాయి.
జూబ్లీహిల్స్ సీటు గత మూడు సార్లు బీఆర్ఎస్ కే దక్కిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ధోరణి కొనసాగుతుందా లేక కాంగ్రెస్ షాక్ ఇస్తుందా అన్నది రేపటికి తేలనుంది.
మాగంటి గోపీనాథ్ గతంలో ఈ సీటు నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన విషయం గుర్తుంచుకోవాలి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం,
“ఈ ఉపఎన్నిక ఫలితాలు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు, అలాగే ఉపఎన్నికలకు సంబంధించిన వ్యూహాలు నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి,” అని చెబుతున్నారు.
ప్రస్తుతం సుమారు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి దర్యాప్తులు జరుగుతున్నాయి. వారిలో ఎనిమిది మంది ఇప్పటికే స్పీకర్ ముందు హాజరయ్యారు. మిగతా ఇద్దరు — కడియం శ్రీహరి మరియు దానం నాగేంద్ర — హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే నెలల్లో మరికొన్ని ఉపఎన్నికలు జరగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అందువల్ల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే కాకుండా, తెలంగాణ రాజకీయ దిశను నిర్ణయించే సూచికగా నిలుస్తున్నాయి. రేపు సాయంత్రం ఫలితాలు వెలువడిన తర్వాత, ఎవరి చేతిలో పగ్గాలు ఉంటాయో అన్నదానిపై స్పష్టత రానుంది.

