ఉపఎన్నికలు, దొంగ ఓట్లు, బీసీ రిజర్వేషన్లు—మెట్టుగూడా కార్పొరేటర్ రాసూరి సునీత సంచలన వ్యాఖ్యలు

ఓకే టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మెట్టుగూడా కార్పొరేటర్ రాసూరి సునీత GHMC పరిధిలో రాబోయే ఉపఎన్నికలు, ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక, అలాగే బీసీ రిజర్వేషన్ల తగ్గింపు వంటి అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేల దళారీతనం, పార్టీ మార్పులపై వివాదం నెలకొనగా, ఎనిమిది మందికి స్పీకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చిన పరిస్థితి, మిగిలిన ఇద్దరు — దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి — ఇంకా సమయం కోరుతున్నారని ఆమె తెలిపారు. కానీ స్పీకర్ నిర్ణయం స్పష్టంగా ఉన్నందున సమయం ఇచ్చే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.

“వాళ్లకు భయం ఏంటంటే… ప్రస్తుత గవర్నమెంట్ వాళ్లకు మళ్లీ టికెట్ ఇస్తుందా అన్న సందేహం. అందుకే రాజీనామా చేసేందుకు భయపడుతున్నారు.” అని సునీత అన్నారు.

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో జరిగిన దొంగ ఓట్ల వ్యవహారంపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేశారు. బుర్కాలు వేసుకున్న పెద్ద సంఖ్యలో వ్యక్తులు వచ్చి ఫేక్ ఓట్లు వేశారని, దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించలేదని ఆమె పేర్కొన్నారు.

500 బుర్కాలు వేసుకొని వచ్చి ఓట్లు వేశారు. 200–300 ఫేక్ ఓట్ల లిస్టులు కూడా దొరికాయి. అధికారులెవ్వరు పట్టించుకోలేదు.” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాక, GHMC పరిధిలో కొన్ని మహిళా సిబ్బందిపై జరిగిన దాడుల విషయంలో కూడా ప్రభుత్వం స్పందించలేకపోయిందని ఆమె విమర్శించారు. ఒక శానిటేషన్ మహిళా ఉద్యోగిపై జరిగిన దారుణ ఘటనను ఉదాహరణగా చూపిస్తూ, ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరిగి ఓట్లు అడగడానికి ధైర్యం ఎలా వస్తోందని ప్రశ్నించారు.

అదే సమయంలో, రాబోయే ఉపఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.

“ప్రజలు వాళ్ల ముఖాలు చూసి ఓట్లు వేయలేదు… కేసీఆర్ గారి ముఖం చూసి వేశారు. అందుకే ఇప్పుడే రాజీనామా చేయడానికి భయపడుతున్నారు.” అని సునీత ఘాటుగా వ్యాఖ్యానించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 23% కు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న అంశంపై కూడా ఆమె తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది మొత్తం చిల్లర రాజకీయాలు. వాగ్దానం చేసిన 42% రిజర్వేషన్లు ఎక్కడ? ప్రజలను మోసం చేయడమే.” అన్నారు.

ఇంద్రమ్మ చీరల పంపిణీలో కాంగ్రెస్ పార్టీపైన ఆమె విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. చీరలపై పార్టీ గుర్తులు ముద్రించడం రాజకీయ నైతికతకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

“చీర మీద కూడా కాంగ్రెస్ గుర్తు వేసి ఇస్తున్నారు. మహిళలను ప్రభావితం చేసే రాజకీయాలు ఇవి. కానీ మహిళలు లొంగే వారు కాదు.” అని ఆమె అన్నారు.

తదుపరి ఎన్నికల్లో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *