ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌పై వివాదం నెలకొంది. ఈ ఎన్‌కౌంటర్‌లో జరిగిన సంఘటనలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)కు న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ అసలు నిజమా? లేదా యథేచ్ఛగా జరిగిన Encounter Killనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజా వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో మరో CRPF బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు CRPF ఐజీ త్రివిక్రం తెలిపారు. ప్రభుత్వం నక్సలిజం నిర్మూలన పేరుతో తీవ్ర చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ వివాదం మరింత చర్చనీయాంశమైంది.
ఈ సంఘటనపై మావోయిస్టు అనుభావులు, హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారి మాటల్లో—
“ఏన్నాళ్ళుగా అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన వాళ్లు ఉండటం వల్ల అధికారులకు భయం ఉండేది. అవినీతి చేసే ముందు రెండు సార్లు ఆలోచించేవారు. ఇప్పుడు వారిని ఎన్‌కౌంటర్ల పేరిట కొడితే ప్రజలకు రక్షణ ఎవరు?”
నక్సలైట్లు ఉండటం మంచిదా చెడ్డదా అనేది వేరే చర్చ. కానీ వారి ఉనికి వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై ఒక నియంత్రణ ఉండేదనే వాదన ముందుకొస్తోంది.
“ప్రజలకు న్యాయం చెప్పేవారు, వ్యవస్థ ఎదుట నిలబడేవారు, అడవులన్నలు లేకపోతే… ఇక సామాన్యులకు ధిక్కు ఎవరు?” అని ఈ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఎనౌంటర్ల పేరుతో మావోయిజం పూర్తిగా తుడిచిపెడతామంటే…
🔹 వ్యవస్థ బాధ్యత పెరుగుతుందా?
🔹 లేక అధికార దుర్వినియోగం పెరుగుతుందా?
అన్నది ప్రజలకు పెద్ద సందేహంగా మారింది.ఈ పరంపర కొనసాగితే—
సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అడగడానికి దిక్కులేని పరిస్థితేకానీ రాదని న్యాయవాది హెచ్చరించారు.ఈ కేసు కేవలం ఒక ఎన్‌కౌంటర్ విషయం కాదు.
ఇది:
✔ హక్కుల గౌరవం
✔ వ్యవస్థ బాధ్యత
✔ ప్రజాస్వామ్య భద్రత— అనే మూడు ప్రశ్నల్ని ముందుకు తెచ్చింది.
అందుకే బాధితుల కుటుంబాలు, హక్కుల సంఘాలు ఈ విషయంపై సమగ్ర, స్వతంత్ర దర్యాప్తు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.

