తెలంగాణలో జరగబోతున్న గ్లోబల్ సమ్మిట్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అసలు ఎవరికి లాభం చేకూరుతుందో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు తెచ్చిన పెట్టుబడులు ఎక్కడున్నాయి? ఏ కంపెనీలు వచ్చాయి? ఎంత పెట్టుబడి వచ్చింది? అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు ప్రభుత్వ నుంచి స్పష్టమైన సమాధానాలు రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
“84వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాం” అని చెప్పినా, ఆ డబ్బు ఎక్కడ వినియోగించబడింది? ఎంత ఉద్యోగాలు వచ్చాయి? ఎలాంటి ఇండస్ట్రీలు ఏర్పాటు అయ్యాయి? అన్న విషయాల్లో పారదర్శకత లేదని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు మంత్రులు, పెద్ద నాయకులు, ఐఏఎస్ లు, వారి బంధువులు భారీగా భూములు, హైరైస్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు లేకుండానే భవనాలు నిర్మించడానికి అనుమతులు ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
“ప్రజలు అడిగేది భవిష్యత్తు 2047 కాదు… నేటి జీతాలు, నేటి ఉద్యోగాలు, నేటి హక్కులు” అని మాట్లాడుతున్న స్వరం మరింత బలంగా వినిపిస్తోంది.
రాష్ట్ర వెబ్‌సైట్లు హ్యాక్ అవుతున్నాయి, సెక్యూరిటీ లోపాలు బయటపడుతున్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం గ్లోబల్ సమ్మిట్ ప్రమోషన్‌లో బిజీగా ఉందని ఆరోపణలు చెలరేగుతున్నాయి.
చివరగా, విమర్శకులు నేరుగా సవాల్ విసిరారు:
దమ్ముంటే ఓపెన్ డిబేట్‌కి రండి — కంపెనీలు ఏవి? పెట్టుబడులు ఏవి? లాభాలు ఏవి?”

