తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి చేపట్టి రెండు సంవత్సరాలు గడిచింది. అయితే, ఈ సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నిస్తూ, ఆయనపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “నాకు ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి… అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను” అని ఒక రాజకీయ నాయకుడు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
ఆయన మాట్లాడుతూ— “రేవంత్ రెడ్డి సీఎం కాకముందు మరియు అయ్యాక ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటీ నిలబెట్టుకోలేదు. కనీసం ఆరు గ్యారెంటీల్లో ఒకటి కూడా అమలు కాలేదు. రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు భృతీ, మహిళలకు ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు, రేషన్ కార్డులు— ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి ఇచ్చిన తప్పుడు హామీలే”— అని ఆరోపించారు.
అంతేకాక, రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయిందని, వేల కంపెనీలు హైదరాబాద్‌ను వీడి వెళ్లిపోతున్నాయని అన్నారు. “కోటి రూపాయల ఫ్లాట్ ఇప్పుడు 50 లక్షలకే వస్తోంది. భూముల ధర అర్ధానికి పడిపోయింది” అని పేర్కొన్నారు.
ముఖ్యంగా, భారీ అవినీతి ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడిపై FIR, వేల ఎకరాల భూముల పై అక్రమ లావాదేవీలు, కోట్లు సంపాదించారని పలు పేర్లను ప్రస్తావించారు.
తాజా గ్లోబల్ సమ్మిట్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు:
“400 కోట్లతో సమ్మిట్ చేస్తున్నారట… 200 దేశాధినేతలు వస్తారా? ఒక్క పెద్ద ఇన్వెస్టర్ కూడా రాలేదు. ఇవన్నీ ఎన్నికల డీల్స్ మాత్రమే.”
చివరగా ప్రజలకు పిలుపునిస్తూ—
“తెలంగాణను కాపాడండి. నిరుద్యోగులు, యువత ముందుకు రావాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి” — అని కోరారు.

