బాలీవుడ్ బ్యూటీలు మౌని రాయ్, దిశా పటానీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందం, అభినయంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలతో నెట్టింట సందడి చేస్తూ ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు.
అయితే గత కొంతకాలంగా మౌని రాయ్, దిశా పటానీ కలిసి ఎక్కువగా కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. వెకేషన్లు, బర్త్‌డే సెలబ్రేషన్లు, స్పెషల్ అకేషన్లు… ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల్లో కనిపించే కెమిస్ట్రీపై నెటిజన్లు, సినీ ప్రియులు తరచూ స్పందిస్తున్నారు.
హాలీడే ట్రిప్స్ నుంచి పర్సనల్ మూమెంట్స్ వరకూ ఇద్దరూ విడదీయరాని పక్షుల్లా కనిపించడంతో… ఇది కేవలం స్నేహమేనా? లేక స్నేహానికి మించిన బంధమా? అనే చర్చ మొదలైంది. దీంతో వీరి రిలేషన్‌పై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాలపై మౌని, దిశా పలుమార్లు స్పందిస్తూ తాము మంచి స్నేహితులమని, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
కానీ ప్రతి కొత్త ఫోటో, ప్రతి ట్రిప్, ప్రతి పోస్ట్ చూసినప్పుడల్లా నెటిజన్లు కొత్త కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే దిశా, మౌని తమ పార్టనర్స్‌తో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లారు. ఆ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఇద్దరూ కలిసి ఉన్న పిక్స్, వాటి క్యాప్షన్లు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో వారి రిలేషన్‌పై మరోసారి చర్చ మొదలైంది.
వాస్తవానికి మౌని రాయ్ ఇప్పటికే బిజినెస్‌మాన్ సూరజ్ నంబియాన్‌ను వివాహం చేసుకున్నారు. అయినా ఆమె లైఫ్ ఈవెంట్స్‌లో దిశా తరచూ కనిపిస్తుంటుంది. మరోవైపు దిశాకు కూడా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతడు విదేశాల్లో ఉంటాడని సమాచారం. అయినప్పటికీ దిశా జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో మౌని రాయ్ తప్పనిసరిగా కనిపించడం విశేషం.
ఏదేమైనా మౌని రాయ్, దిశా పటానీ మధ్య బంధం ఏంటన్నది వారిద్దరికే తెలుసు. అది క్లోజ్ ఫ్రెండ్షిప్పా? లేక ఇంకేదైనా ఉందా? అన్నది బయటవాళ్లకు తెలియదు. అయితే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అభిమానులకు ఆసక్తి ఉండటం సహజమే. అందుకే ఇలాంటి రూమర్స్, సోషల్ మీడియా చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. మొత్తానికి ప్రస్తుతం మౌని–దిశ రిలేషన్ బాలీవుడ్‌లో హాట్ డిస్కషన్ టాపిక్‌గా మారింది.

