చామేట్ యాప్: మహిళలను పక్కదారి పట్టిస్తున్న ప్రమాదకర సోషల్ ట్రాప్!

తెలంగాణలో చామేట్ (Chamet) పేరుతో నడుస్తున్న యాప్ మహిళలను, ముఖ్యంగా ఒంటరి మహిళలను, యువతలను, వివాహితలను లక్ష్యంగా చేసుకుని పక్కదారి పట్టిస్తోంది. ఈ యాప్‌లో “ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? కొత్త స్నేహితులను చేసుకోండి!” అంటూ వచ్చే యాడ్స్ ఆకర్షణగా కనిపించినా, దాని వెనుక నడుస్తున్న అసలైన ఆట భయంకరంగా ఉంది.

సూర్యాపేట జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ ద్వారా అనేక మంది మహిళలు మోసపోయినట్లు సమాచారం. ప్రారంభంలో ఈ యాప్ చాటింగ్, వీడియో కాల్స్, స్నేహితత్వం పేరుతో డబ్బులు వసూలు చేస్తుంది. కానీ, తర్వాత దానిని న్యూడ్ వీడియో కాల్స్, రికార్డింగ్‌లు, బ్లాక్‌మెయిలింగ్‌లుగా మార్చేస్తున్న దుస్థితి వెలుగులోకి వచ్చింది.

ఇలాంటి యాప్‌లలో చాలా వరకు ప్రాస్టిట్యూషన్ రాకెట్లకు, సైబర్ బ్లాక్‌మెయిల్ గ్యాంగ్‌లకు వేదికలుగా మారుతున్నాయి. డబ్బు కోసం, లేదా ప్రేమాభిమానాల కోసం వీక్నెస్ ఉన్న మహిళలు ఈ యాప్‌ల వలలో చిక్కుతున్నారు. చాలా సందర్భాల్లో ఈ వీడియోలు రికార్డ్ చేసి, వాటితో డబ్బులు దోచుకోవడం జరుగుతోంది.

పోలీసులు ఇప్పటికే బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఈ ఫ్రెండ్ యాప్‌లు, చామేట్ యాప్‌లు మరింత ప్రమాదకరంగా మారాయి.
హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు, సివి ఆనంద్ గారు వంటి అధికారులు ఈ యాప్‌లపై దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సోషల్ మీడియా యాడ్స్ ద్వారా “ప్రేమ కావాలా?” “ఒంటరితనం పోయాలా?” అనే లైన్లతో యువతను, మహిళలను ఆకర్షిస్తున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిన సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న యువత ఈ యాప్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు.
ఇది కేవలం ఆన్‌లైన్ చాట్ మాత్రమే కాదు, మహిళల జీవితాలపై, కుటుంబాలపై దెబ్బ కొడుతున్న సామాజిక విపత్తుగా మారింది.

సమాజం మరియు సైబర్ విభాగం జాగ్రత్తగా ఉండాలి —
ఇలాంటి యాప్‌లు కేవలం మోసం కాదు, మానసికంగా, సామాజికంగా మహిళలను విరిగే ప్రమాదం ఉంది.
ప్రజలంతా సైబర్ అవగాహన పెంచుకోవాలి, ఇలాంటి యాప్‌లను దూరంగా ఉంచి, మరెవరైనా ఇబ్బందిలో ఉన్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *