విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే పాలన కంటే హై డ్రామా ఎక్కువగా నడుస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి, చదువుల పేరుతో ట్రైనింగ్లకు వెళ్లిన సీఎం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు – కానీ అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొత్తం వ్యవహారం “నువ్వు కొట్టినట్టు చేయి… నేను ఏడిచినట్టు చేస్తా” అన్న నాటకంలా మారిపోయింది.
బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్నట్టుగా చూపిస్తున్న చర్యలు చూస్తే, ఏదో పాకిస్తాన్‌పై యుద్ధానికి వెళ్లినట్టు హడావుడి. కేటీఆర్ బయటికి వస్తే “జై కేటీఆర్”, హరీశ్ రావు కనిపిస్తే “జై హరీశ్ రావు” అంటూ పార్టీ కార్యకర్తల శోకసంద్రం. కానీ వాస్తవానికి ఎవ్వరూ అరెస్ట్ కాలేదు, ఎవ్వరిపై స్పష్టమైన చర్యలు కూడా లేవు. అంతా కెమెరాల ముందు నడిచే హై వోల్టేజ్ డ్రామానే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ హడావుడిని కాస్త పక్కన పెడితే, అసలు ప్రశ్న – తెలంగాణ క్యాబినెట్లో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా నడుస్తోంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. రేవంత్ రెడ్డి పాలనపై కేవలం ప్రజలకే కాదు, స్వయంగా మంత్రులకూ ఫ్రస్ట్రేషన్ వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈ హడావుడిని కాస్త పక్కన పెడితే, అసలు ప్రశ్న – తెలంగాణ క్యాబినెట్లో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా నడుస్తోంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. రేవంత్ రెడ్డి పాలనపై కేవలం ప్రజలకే కాదు, స్వయంగా మంత్రులకూ ఫ్రస్ట్రేషన్ వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.
భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఇలా కీలక మంత్రులంతా కలిసి ఏదో చేస్తున్నట్టే కనిపిస్తోంది. మధ్య మధ్యలో శ్రీధర్ బాబు కూడా చేరతాడు. కానీ ఏం చేస్తున్నారు? ప్రజలకు మాత్రం స్పష్టత లేదు.
తాజాగా భట్టి విక్రమార్క ప్రజాభవన్‌కు మంత్రులందరినీ పిలిచి సమావేశం పెట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై “ఖండనలు వస్తాయి, ఖండనలే ఖండనలు” అని కొందరు అన్నా, అసలు ప్రశ్న వేరే ఉంది. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడు ఉపముఖ్యమంత్రి సమావేశం పెట్టవచ్చా? పెట్టవచ్చు. కానీ అదే సమయంలో “ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను పడిందా?” అన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అన్నదే అసలు లాజిక్.
ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడు పాలనా బాధ్యతలు ఉపముఖ్యమంత్రి చూసుకోవచ్చు అని చెప్పినప్పుడు, అదే ఉపముఖ్యమంత్రి రాజకీయంగా పావులు కదుపుతున్నాడేమో అన్న చర్చ రావడం సహజమే. ఇక్కడ నిప్పు పెట్టేది ఎవరు? అనుమానాలకు తావు ఇచ్చేది ఎవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే, మరో కీలక అంశం – అడ్మినిస్ట్రేషన్. ఐఏఎస్ అధికారులు నిజంగా పనిచేస్తున్నారా? లేక రాజకీయ ఒత్తిళ్ల మధ్య తేలిపోతున్నారా? ప్రభుత్వం ఒక దిశ లేకుండా నడుస్తోందా అన్న సందేహాలు ప్రజల్లో పెరుగుతున్నాయి.
మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వంపై “పాలన కన్నా ప్రదర్శన ఎక్కువ” అన్న విమర్శలు బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి గైర్హాజరీ, మంత్రుల మధ్య అసంతృప్తి, బయటికి కనిపించే హై డ్రామా – ఇవన్నీ కలిపి చూస్తే, ప్రభుత్వం కుప్పకూలే దిశగా వెళ్తుందా? అన్న ప్రశ్నలు ఓకే టీవీ లాంటి చానెళ్లు కూడా వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

