నారాయణపేట మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్యపై వివాదం… అసలు కారణాలు వెలుగులోకి తేవాలని డిమాండ్

నారాయణపేట జిల్లా మక్తల్‌లో బీజేపీ అభ్యర్థిగా ఉన్న గిరిజన నాయకుడు ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతల రాజకీయ ధోరణిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నా, అసలు కారణాలను వెలికితీయకుండా రాజకీయ లాభనష్టాల కోసం రోడ్డెక్కి నిరసనలు చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చే సందర్భాల్లో నిరసనలు చేపట్టడం రాజకీయాల్లో సాధారణం. అయితే స్వపక్ష పార్టీ నేతలే ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తే, వాటి వెనుక ఉన్న కారణాలను ప్రజలకు వెల్లడించడం ఆ పార్టీ బాధ్యతగా మారుతుంది.

మహాదేవప్ప ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఏమిటి?
సొంత పార్టీ నాయకుల ఒత్తిడి ఉందా?
బి-ఫామ్ ఇచ్చిన తర్వాత అవమానాలకు గురయ్యారా?
లేదా మరేదైనా రాజకీయ ఒత్తిడి కారణమా?

ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. నిజాలు బయటకు రాకముందే అధికార పార్టీపై ఆరోపణలు మోపడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.

మహాదేవప్ప మరణం వెనుక సొంత పార్టీ నాయకుల ఒత్తిడి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ ఘటనపై పూర్తి బాధ్యత తీసుకుని నిజాలు వెల్లడించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే స్థానిక నాయకత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

మహాదేవప్ప ఆత్మహత్యకు కారణమైన పరిస్థితులు ఏమిటో ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత బీజేపీ నాయకత్వంపై ఉందని, పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *