తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీమ్ తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 15 రోజుల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సచివాలయంలో కే. రామకృష్ణ రావు అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల నేతలు, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులు హాజరై హెల్త్ పాలసీపై కీలక నిర్ణయాలు చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, రిటైర్డ్ సిబ్బందికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే దిశగా ఈ పథకం రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త హెల్త్ స్కీమ్ తీసుకురావడం మంచి నిర్ణయమేనని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నప్పటికీ, మరోవైపు జీతాల చెల్లింపుల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరగడంలో గందరగోళం నెలకొనడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిందని అధికారులు చెబుతుండగా, మధ్యవర్తులు ఇంకా అందలేదని చెబుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అసలు నష్టపోతున్నది ఉద్యోగులేనని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజువారీ ఖర్చులు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని పలువురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి కూడా అంతే ఆందోళనకరంగా ఉందని సంఘాలు చెబుతున్నాయి. వారికి రావాల్సిన బెనిఫిట్లు ఆలస్యమవడంతో వైద్య చికిత్సకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సేవా కాలంలో దాచుకున్న నిధులు ఎక్కడికి వెళ్లాయన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదని విమర్శిస్తున్నారు.