తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారిన ఎండోమెంట్ శాఖ వివాదంపై ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ, ఆమె కూతురు కొండా సుష్మిత కలిసి ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారిని కలిశారు. ఈ భేటీలో వివాదానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని సమాచారం. మీనాక్షి మేడం ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి వివరణ తీసుకుని, త్వరలో పరిష్కారం తీసుకురావాలని హామీ ఇచ్చారు.
ఇక, వివాదం మొదటగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సురేఖ సమావేశం సందర్భంగా మొదలైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎండోమెంట్ శాఖలో అవినీతి, అధికార దుర్వినియోగం, మరియు సుమంత్ అనే ఓఎస్డీపై ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కొండా సురేఖ తన పదవి నుంచి వైదొలగుతానని హెచ్చరించినట్టు సమాచారం.
ఎండోమెంట్ శాఖలో 500 కోట్ల రూపాయల ఫండ్లు మాయమైనట్లు ఆరోపణలు రావడంతో, ఈ అంశంపై కూడా మీనాక్షి మేడం సమీక్షించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వివాదం కొంతకాలం సద్దుమణిగినప్పటికీ, రాజకీయ వర్గాల్లో ఈ చర్చ ఇంకా వేడిగా కొనసాగుతోంది.

