జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేడుక ఘనంగా జరిగింది. యసగూడా చెక్‌పోస్ట్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ, జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, ఎల్వీ ప్రసాద్ మార్గం గుండా ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కొందరు బోనాలు ఎత్తుకొని, కొందరు కోలాటాలు ఆడుతూ ర్యాలీని పండుగలా మార్చారు.
స్థానిక ప్రజలు నవీన్ యాదవ్ పట్ల తమ మద్దతు వ్యక్తం చేస్తూ, “ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రీ బస్, ₹500 గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ, ఇళ్ల నిర్మాణ ప్రణాళికలు, మహిళా సంక్షేమ పథకాలు వంటి నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసం కలిగించాయని అన్నారు.
అదే సమయంలో, బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఫేక్ ఓటర్ ఐడీ ఆరోపణలను ప్రజలు తీవ్రంగా ఖండించారు. “నవీన్ యాదవ్ ప్రజా నాయకుడు, స్థానికుల మద్దతు ఉన్న నాయకుడు, ఎప్పటినుంచో ప్రజల సేవలో ఉన్నాడు” అని స్థానికులు పేర్కొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న ఓ యువకుడు మాట్లాడుతూ, “ఇది పబ్లిక్ ప్రేమ ర్యాలీ, ఫేక్ కాదు. ఈసారి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పట్టు బిగుస్తుంది. కేసీఆర్ సభ పెట్టినా కూడా ప్రజలు మారరని మేము నమ్ముతున్నాం” అని అన్నాడు.
ఈ నామినేషన్ ర్యాలీ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ శక్తి ప్రదర్శనగా నిలిచింది.

