శీర్షిక: సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఎస్పీకి ఫిర్యాదు.. షబ్బీర్ అలీపై గడ్డం హిందూప్రియ తీవ్ర ఆరోపణలు
కామారెడ్డి, జూన్ 12: తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు గడ్డం హిందూప్రియ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు, అనుచరులే ఈ ట్రోలింగ్ వెనుక ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉదయం నుంచి సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలంతో పోస్టులు, కామెంట్లు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని హిందూప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే అంశంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇలాంటి చర్యలు ఆగలేదని తెలిపారు. ముఖ్యంగా షబ్బీర్ అలీ అన్న కుమారుడు షేరు, ఆయన కుమారుడు ఇలియాస్, పర్వేజ్ తదితరులు తనపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే కామారెడ్డిలోని మహిళలు, మాజీ కౌన్సిలర్లు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు తనకు సంఘీభావం ప్రకటించారని చెప్పారు. మహిళలందరి తరఫున ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
తాను ప్రజాసేవలో ఎప్పటి నుంచో చురుకుగా పనిచేస్తున్నానని హిందూప్రియ పేర్కొన్నారు. వైస్ చైర్మన్‌గా ఉన్న సమయంలోనూ, అనంతరం కూడా పేదలకు ఆర్థిక సహాయం, జాబ్ మేళాల నిర్వహణ, రక్తదాన శిబిరాలు, ఆస్పత్రుల్లో అవసరమైన వారికి సహాయం, వికలాంగులకు వాహనాల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. తన భర్త, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి స్వంత నిధులతో అనేక కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు.
తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేకే తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని షబ్బీర్ అలీపై విమర్శలు గుప్పించారు. ప్రజాసేవలో చురుకుగా పనిచేస్తున్న మహిళలను టార్గెట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
“మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి సమాజ సేవ చేయాలని రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా నాయకులను కించపరుస్తూ ట్రోలింగ్ చేయడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ

