కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఉధృతం – రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సూటి విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ నాయకత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజమైన కార్యకర్తల మాట వినడం లేదు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడితేనే పనులు జరుగుతున్నాయి, మేము చెప్పిన పనులు ఒక్కటి కూడా జరగడం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ అంతర్గత పరిస్థితులపై పెద్ద చర్చ మొదలైంది. ఆయన మాట్లాడుతూ,

నాలుగు దశాబ్దాలుగా కష్టపడిన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు అవమానం ఎదుర్కొంటున్నారు. మేము చెప్పిన మాటలకు విలువ లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడిగితేనే అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ తెలివి లేదు, ఎవరి మీద యుద్ధం చేస్తున్నామో కూడా క్లారిటీ లేదు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడుతూ, “జగిత్యాల నియోజకవర్గంలో గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ అనే ఒకే సంస్థకు అన్ని కాంట్రాక్టులు వెళ్తున్నాయి. ఇది ఏంటి పరిస్థితి?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

జీవన్ రెడ్డి మరింతగా మాట్లాడుతూ,

“రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేం మానసికంగా హింసను అనుభవిస్తున్నాం. కాంగ్రెస్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ రాజకీయాల్లో నిజమైన కార్యకర్తల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారు. అభివృద్ధి కోసం అడిగితే పట్టించుకోవడం లేదు” అని ఆరోపించారు.

ఆయన వ్యాఖ్యల్లో మరో కీలకమైన అంశం — కాంగ్రెస్‌లో “కమిషన్ రాజకీయాలు” నడుస్తున్నాయనే ఆరోపణ. “కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సెటిల్మెంట్ బ్యాచ్‌లకు అడ్డాగా మారింది. రౌడీలకు పదవులు ఇస్తున్నారు, కానీ పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు అవకాశాలు రావడం లేదు” అని తీవ్ర విమర్శలు చేశారు.

“కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ‘ఇక్కడ సెటిల్మెంట్లు చేయబడును’ అని బోర్డు పెట్టుకోవాలి. అప్పుడు ప్రజలకు క్లారిటీ వస్తుంది” అని చురకలంటించారు.

జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ నాయకత్వంపై పెద్ద దెబ్బగా మారాయి. ముఖ్యంగా పార్టీ అంతర్గతంగా రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతోందనే సంకేతాలు బయటకు వస్తున్నాయి.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు మరియు కొత్త నాయకత్వం మధ్య తలెత్తుతున్న విభేదాలను బహిర్గతం చేస్తున్నాయి.

జీవన్ రెడ్డి చివరిగా పేర్కొంటూ,

జీవన్ రెడ్డి చివరిగా పేర్కొంటూ,

“నాకు పదవులు అవసరం లేదు, నా కార్యకర్తల హక్కులు కాపాడడం నా కర్తవ్యం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కష్టం, కాంగ్రెస్ భవిష్యత్తు చీకటిలో ఉంది” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *