కాంగ్రెస్‌లో అసంతృప్తి పెరుగుతోందా? సీఎం రేవంత్‌పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందనే చర్చకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పని చేసిన సీనియర్ నాయకులకు గౌరవం దక్కడం లేదని, ప్రస్తుతం పార్టీలో కొత్తగా చేరిన వారిదే హవా నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం “షో ఆఫ్ ప్రభుత్వం” నడుస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార…

