తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. జగిత్యాలలో నిర్వహించబోతున్న జైత్రయాత్ర సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతుండగా, ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ లోకి చేరనున్నట్టు సమాచారం.
జీవన్ రెడ్డి తో పాటు వందలాది మంది కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్యలు చేపట్టారు.
జగిత్యాల గడ్డపై “కేసీఆర్ రావాలి – రేవంత్ రెడ్డి పోవాలి” అనే నినాదంతో ఈ జైత్రయాత్ర ప్రారంభం కానుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ సభ ద్వారా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి కూడా రోజురోజుకు బయటపడుతోంది. బాన్సవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. నిధుల మంజూరులో ఆలస్యం, మంత్రుల స్పందన లేకపోవడం వంటి అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి కూడా రోజురోజుకు బయటపడుతోంది. బాన్సవాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. నిధుల మంజూరులో ఆలస్యం, మంత్రుల స్పందన లేకపోవడం వంటి అంశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఇది ఒక్క పోచారం మాత్రమే కాదు, గతంలో పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా ఢిల్లీలో ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం వంటి ఆరోపణలు అప్పటినుంచే వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలు ఎదురవుతోంది. ముఖ్యంగా సీనియర్ నేతలు అసంతృప్తితో పార్టీని వీడే పరిస్థితి వస్తే అది పెద్ద రాజకీయ దెబ్బగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.
మొత్తానికి జగిత్యాల జైత్రయాత్రతో బీఆర్ఎస్ మరోసారి రాజకీయంగా ఆక్టివ్ అవుతుండగా, కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింతగా బయటపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

