ఆపరేషన్ కొండా.. సురేఖ రాజీనామా చేస్తారా? లేక మంత్రివర్గ ప్రక్షాళనతో సమస్యకు చెక్?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ వేదికగా కీలక చర్చలు జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సురేఖను స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేయించాలని అధిష్టానం భావిస్తోందా? ఆమె అందుకు అంగీకరించకపోతే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? ఒకవేళ ఆమెపై నేరుగా చర్యలు తీసుకుంటే పార్టీకి కొత్త సమస్యలు వస్తాయా? అనే అంశాలపై కాంగ్రెస్‌లో విస్తృతంగా…

