మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లిక్కర్ నియమాలపై వివాదం – ప్రభుత్వం సీరియస్‌గా

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లిక్కర్ నియమాలపై వివాదం – ప్రభుత్వం సీరియస్‌గా

మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల మద్యం విక్రయాలపై పెట్టిన కఠినమైన షరతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేశాయి. తన నియోజకవర్గంలో లిక్కర్ షాపులు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరవాలని, పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వకూడదని ఆయన నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారి తీసింది.

దీంతో వ్యాపారవేత్తలు స్థానికంగా టెండర్లు వేయడానికి వెనుకంజ వేశారు. ఈ పరిణామంపై ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన మద్యం పాలసీ ఉంటుందని, ఎవరి ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెట్టే అధికారం ఎవరికి లేదని స్పష్టం చేసింది.

ఈ వ్యవహారం మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కూడా వెళ్లింది. ఆయన మాట్లాడుతూ “స్టేట్ మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుంది. ఒక నియోజకవర్గం కోసం వేరే రూల్స్ ఉండవు. చట్టం అందరికీ ఒకటే” అని స్పష్టంచేశారు.

రాజగోపాల్ రెడ్డి వైఖరిపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురు మంత్రులకు పదవులు ఇచ్చి, తనకు ఇవ్వకపోవడం సరికాదని ఆయన ఆరోపించారు. “పార్టీ కోసం కష్టపడ్డాను, ఆస్తులు అమ్ముకున్నాను, కానీ గుర్తింపు రాలేదు” అని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక పార్టీ అధిష్టానం ఆయన ప్రవర్తనపై పూర్తి నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. ఆయన తరచుగా సీఎం రేవంత్ రెడ్డి పట్ల పరోక్ష విమర్శలు చేయడం కూడా పార్టీ లోపల ఉద్రిక్తతను పెంచింది.

కాంగ్రెస్‌లో “బ్యాగులు మోసేవారికి పదవులు వస్తాయి, కష్టపడేవారికి గుర్తింపు ఉండదు” అంటూ ఆయన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో ఆయనపై పార్టీ నమ్మకం మరింత తగ్గిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి

.కాంగ్రెస్‌లో “బ్యాగులు మోసేవారికి పదవులు వస్తాయి, కష్టపడేవారికి గుర్తింపు ఉండదు” అంటూ ఆయన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో ఆయనపై పార్టీ నమ్మకం మరింత తగ్గిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *