తెలంగాణ ఉద్యమ యోధుడు, టిజేఎస్ వ్యవస్థాపకుడు కోదంరాం గారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో అశేషమైనది. తెలంగాణ కోసం ఆయన నిస్వార్థంగా, నిజాయితీగా పోరాడినవారిలో అగ్రగణ్యులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన నిరంకుశ వ్యవహారాలను వ్యతిరేకిస్తూ ఆయన టిజేఎస్ పార్టీని స్థాపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో, ముఖ్యంగా 2023 ఎన్నికల్లో టిజేఎస్ మరియు కమ్యూనిస్టు పార్టీల మద్దతు కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ 80,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు.
మహిళల సంక్షేమం, రైతు భరోసా, రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి పథకాలు ప్రజల్లో విశేష స్పందన పొందుతున్నాయని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపునకు టిజేఎస్, సిపిఐ, సిపిఎం మరియు ఎంఐఎం పార్టీల మద్దతు కీలకమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ప్రజల ఆశలకనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, టిజేఎస్ పార్టీ సహకారం ప్రభుత్వానికి మరింత బలం ఇస్తుందని అన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజల్లో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రతిఫలిస్తున్నాయని, ఈసారి కాంగ్రెస్ పార్టీ 50 వేలకుపైగా మెజారిటీతో గెలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

