50 ఏళ్లుగా అమీర్‌పేటలోనే ఉంటున్నాం.. ఇల్లు మాత్రం రాలేదు! కాంగ్రెస్ వచ్చాక మార్పు ఏంటి?

హైదరాబాద్ అమీర్‌పేటలో పేదల పరిస్థితిపై గ్రౌండ్ రియాలిటీ ఏంటి? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని స్థానిక మహిళ ఆవేదన. కేసీఆర్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసినా ఇల్లు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎదురుచూపులు తప్పడం లేదని వ్యాఖ్య. హైదరాబాద్ అంటే అభివృద్ధికి మారుపేరు. భారీ రోడ్లు, మెట్రో, కమర్షియల్ భవనాలు, కొత్త నిర్మాణాలు.. నగరం రోజురోజుకూ రూపురేఖలు మార్చుకుంటోంది. కానీ ఇదే హైదరాబాద్‌లో కొన్ని కుటుంబాలు మాత్రం దశాబ్దాలుగా సొంత ఇంటి…

Read Full News

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజు దోపిడీ.. నాలుగేళ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు!

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజు దోపిడీపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ కోర్సు కాల పరిమితి నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బి, సి కేటగిరీ విద్యార్థుల నుంచి ఐదేళ్లకు ఫీజు వసూలు చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నాలుగేళ్లకే ఫీజు వసూలు…

Read Full News

ఫీజు బకాయిలపై బీజేపీ దీక్ష.. రాహుల్ గాంధీకి రామచందర్‌రావు సవాల్

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షతో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం “ఫీజు బకాయి.. బీజేపీ లడాయి” పేరుతో చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షను రామచందర్‌రావు ప్రారంభించారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు…

Read Full News

మూసాపేట్‌లో ప్రజల కష్టాలు.. నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్త సమస్యలపై ఆవేదన

హైదరాబాద్‌లోని మూసాపేట్ ప్రాంతంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓకే టీవీ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్టింగ్‌లో ప్రజలు తమ సమస్యలను వెల్లడించారు. కొన్నేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నామని చెబుతున్న స్థానికులు నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, చెత్త తొలగింపు, పెన్షన్లు, ఇళ్ల వంటి పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు. స్థానికుల ప్రకారం.. మూసాపేట్‌లో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా లేదని, నీరు వచ్చినా పరిమిత సమయం మాత్రమే వస్తోందని చెప్పారు. నీటి సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే…

Read Full News

గుట్టల బేగంపేటలో 22A షాక్.. వేల కోట్ల విలువైన భూములు బ్లాక్?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా గుట్టల బేగంపేట పరిధిలోని పలు కాలనీలు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు, స్వంత ఇళ్లకు సంబంధించిన భూములు నిషేధిత జాబితాలోకి చేరినట్లు ఆస్తి యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు తాజాగా నోటీసులు అందడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. తమకు HMDA, GHMC అనుమతులు ఉన్నాయని, లేఔట్లు, నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నామని, రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయని చెబుతున్న…

Read Full News

గ్రేటర్ హైదరాబాద్‌లో 22A షాక్.. లక్షల కోట్ల ఆస్తులు నిషేధిత జాబితాలోకి?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తుల యజమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, వక్ఫ్ తదితర వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో చేర్చే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A పరిధిలోకి ప్రైవేట్ ఆస్తులు కూడా వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన ఇళ్లు, స్థలాలు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీల యజమానులు అయోమయంలో పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, షేక్‌పేట్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్,…

Read Full News

తెలంగాణలో 93 లక్షల ఓటర్లకు నోటీసులా? 32 లక్షల ఓట్ల మ్యాపింగ్‌పై అభ్యంతరాలు.. 61 లక్షల పేర్లలో తేడాలు

హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం ప్రచురించనున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోలింగ్‌ స్టేషన్లు, మండలాల వారీగా ఈ జాబితాలను అందుబాటులో ఉంచనున్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు స్వీకరించనున్నారు. నోటీసులు జారీ చేసిన అనంతరం వాటికి సమాధానాలను అక్టోబర్ 15 వరకు స్వీకరించే ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు…

Read Full News

22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ ఆస్తులు.. ఒకే సర్వే నంబర్‌తో వేలాది మందికి భూకష్టాలు!

హైదరాబాద్: తెలంగాణలో 22A నిషేధిత జాబితా వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ ఆస్తులు కూడా నిషేధిత జాబితాలోకి చేరుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి, గతంలో పేదలకు కేటాయించిన భూములు, సీలింగ్ సర్ప్లస్ భూములు వంటి విభిన్న కేటగిరీలు ఉన్నప్పటికీ.. మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల సామాన్య ఆస్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధితులు చెబుతున్నారు. ఒకే సర్వే…

Read Full News

22A నిషేధిత జాబితాపై రైతుల ఆందోళన.. పట్టా భూములను మళ్లీ ఎందుకు చేర్చారంటూ ప్రశ్నలు

హైదరాబాద్: తెలంగాణలో భూ రికార్డుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ధరణి పోర్టల్‌ సమయంలో ఎదురైన భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై.. ప్రస్తుతం 22A నిషేధిత జాబితా విషయంలో రైతులు, భూ యజమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పట్టా భూములుగా కొనసాగుతున్న భూములను మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత పట్టా భూములకు కొత్త చిక్కులు? రైతులు, భూ యజమానుల…

Read Full News

తెలంగాణలో ఆటోలకు గుడ్ న్యూస్.. ఈవీగా మార్చుకుంటే రూ.1.50 లక్షల వరకు సాయం

హైదరాబాద్: నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లపై పెరుగుతున్న ఇంధన భారాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన ఆటోలకు గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నారు. పాత ఆటోలను ఈవీలుగా మార్చుకునే అవకాశం ఈ పథకంలో…

Read Full News