ఓల్డ్ సిటీ మెట్రో పనులకు వేగం.. యంగ్ ఇండియా స్కూళ్లపై కొత్త చర్చ

హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ మెట్రో పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్‌ నుంచి చంద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన మెట్రో కారిడార్‌కు సంబంధించి భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. రోజురోజుకూ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో సాంకేతిక అంశాలపై…

Read Full News

వర్షాల కోసం వరుణ యాగం.. రైతుల కష్టాలపై ప్రశ్నలు!

కృష్ణమ్మ చెంత వేద మంత్రాల ఘోష.. సీఎం దంపతుల పూర్ణాహుతి తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని కృష్ణా నది తీరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ యాగం వైభవంగా జరిగింది. వేద మంత్రాల ఘోష మధ్య నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు…

Read Full News

BRKR ఆయుర్వేద ఆస్పత్రిలో మూడో రోజుకు చేరిన నిరసనలు.. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్న AYUSH విద్యార్థులు

హైదరాబాద్: బీఆర్కేఆర్ (BRKR) ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో AYUSH హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ పెంపు కోసం చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. రెండేళ్లకోసారి పెరగాల్సిన స్టైఫండ్ 2018 నుంచి పెరగకపోవడంతో, తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. “మాకు కావాల్సింది హక్కు మాత్రమే” నిరసనలో పాల్గొన్న విద్యార్థుల మాటల్లో, తాము ఎలాంటి అదనపు ప్రయోజనాలు కోరడం…

Read Full News

అక్రమాలకు చెక్‌.. ఒకే గొడుగు కింద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్? అవినీతి తగ్గాలంటే అధికారులు మారాలా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. రాష్ట్రంలో వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సివిల్ సప్లైస్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల్లో ప్రస్తుతం విడివిడిగా పనిచేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూడు శాఖల్లో విజిలెన్స్ వ్యవస్థలు వేర్వేరుగా…

Read Full News

హైదరాబాద్‌లో కుండపోత.. హైడ్రా స్పందనకు ప్రశంసలు.. కానీ ముందస్తు చర్యలు ఎక్కడ?

నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. రోజంతా పలుచోట్ల జల్లులు కురవగా, రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం దంచికొట్టింది. రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది. ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఒక విషయం మాత్రం తప్పకుండా చెప్పాలి. వర్షం పడిన వెంటనే హైడ్రా బృందాలు రంగంలోకి దిగి అర్ధరాత్రి వరకు సహాయక…

Read Full News

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నగరం జలమయం.. ముందస్తు చర్యలపై మళ్లీ ప్రశ్నలు!

హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కొనసాగగా, రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అత్యవసర సహాయక చర్యల కోసం హైడ్రా (HYDRAA) బృందాలు రంగంలోకి దిగి నీటిని తొలగించే పనులు చేపట్టాయి. అయితే ప్రజల్లో ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న…

Read Full News

లస్కర్ బోనాలు వైభవం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లస్కర్ బోనాలు ఈసారి అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఫలహార బండ్ల ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలతో ఆలయ పరిసరాలు భక్తి శోభతో కళకళలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మంత్రులు…

Read Full News

స్టైఫండ్ పెంచాలి.. AYUSH పీజీ విద్యార్థుల సమ్మె.. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో ఆయుష్ (ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, నేచురోపతి) పీజీ, యూజీ విద్యార్థులు స్టైఫండ్ పెంపు కోసం ఆందోళన బాట పట్టారు. పదేళ్లుగా తమ స్టైఫండ్‌లో సరైన పెంపు లేదని, జీవన వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న మొత్తం సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ విద్యార్థులకు ప్రస్తుతం సుమారు రూ.30 వేల స్టైఫండ్, హౌస్ సర్జన్లకు రూ.18 వేల వరకు మాత్రమే అందుతోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యల్ప…

Read Full News

బీఆర్ఎస్‌కు తీరని లోటు.. పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు, వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, అభిమానులు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఒక ప్రజానాయకుడిపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించేలా అంతిమయాత్ర సాగింది. జూలై 26న హనుమకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన సుదర్శన్ రెడ్డిని తొలుత స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని…

Read Full News

బీఆర్ఎస్‌కు తీరని లోటు.. పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు, వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, అభిమానులు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఒక ప్రజానాయకుడిపై ప్రజలకు ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించేలా అంతిమయాత్ర సాగింది. జూలై 26న హనుమకొండలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన సుదర్శన్ రెడ్డిని తొలుత స్థానిక రోహిణి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని…

Read Full News