మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరే.. జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు
రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టంచేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధి పథకాలపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీ…

