సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సినిమాలు ఎప్పుడూ థియేటర్లలో సందడి చేస్తుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి 2026కి కూడా అనేక సినిమాలు లైన్‌లో ఉండగా, ఇప్పుడు మరో సినిమా ఆ జాబితాలో చేరింది.
హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “నారీ నారి నడుమ మురారి”. సామజవరగమన తర్వాత రామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాం బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య మరియు సంయుక్తా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
దీపావళి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అదే సమయంలో చిత్రబృందం అధికారికంగా సినిమా సంక్రాంతి 2026 రిలీజ్ అని ప్రకటించింది.
శర్వానంద్ గతంలో సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి సినిమాతో మంచి హిట్ సాధించారు. అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ, మరోసారి సంక్రాంతి సీజన్‌లో సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే పెద్ద సినిమాలు కూడా అదే సమయంలో రిలీజ్ కావడం వల్ల “నారీ నారి నడుమ మురారి” చివర్లో వాయిదా పడుతుందా అన్నది చూడాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమయినా, ఇప్పుడు సినిమా ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది.
శర్వానంద్ ఫ్యాన్స్‌కి ఈ సంక్రాంతి పెద్ద గిఫ్ట్‌గా మారనుంది.

