పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెంచుకున్న దర్శకుడు సుకుమార్ ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న డైరెక్టర్లలో ఒకరు. ఇప్పటికే పుష్ప 2 విడుదల తరువాత, ఆయన రామ్ చరణ్తో సినిమా చేయనున్నారని వార్తలు బయటకొచ్చాయి.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోబోయే ఈ ప్రాజెక్ట్, రంగస్థలం తర్వాత చరణ్–సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం చరణ్ తన పెద్ధి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తి కాగానే సుకుమార్ సినిమా ప్రారంభం కానుంది. ఇక పుష్ప 3 విషయంలో సుకుమార్ అల్లు అర్జున్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ షూటింగ్ షెడ్యూల్ ఫ్రీ అవగానే పుష్ప 3 మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, చరణ్ సినిమా తర్వాత సుకుమార్ లిస్ట్‌లో ఎవరు ఉన్నారన్నది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్గా మారింది. సుక్కు–విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ ప్లాన్‌లో ఉన్నప్పటికీ, అది జరుగుతుందా లేదా అనే క్లారిటీ ఇంకా రాలేదు.
అంతేకాదు, ప్రభాస్తో కూడా సుకుమార్ సినిమా ప్లానింగ్‌లో ఉందని సమాచారం. ఇది ఒక భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా రూపొందనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అదేవిధంగా, మహేష్ బాబుతో కూడా మరోసారి సుకుమార్ పని చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్.
ఇద్దరూ గతంలో 1 నేనొక్కడినే సినిమాలో కలిసి పనిచేసినా, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ ఈసారి అయితే ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్తో తిరిగి కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి.
సుకుమార్ పేరు ఇప్పుడు నేషనల్ లెవెల్ బ్రాండ్గా మారిపోయింది. ఆయన సినిమా అంటేనే ఆడియన్స్‌లో ఉత్సాహం, ఆసక్తి పెరుగుతోంది. పుష్ప 1 మరియు పుష్ప 2 సినిమాలతో ఆయన సృష్టించిన ఇంపాక్ట్ కారణంగా, భవిష్యత్తులో ఆయన చేసే ప్రతి ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి.
సుకుమార్ ప్లాన్ చేస్తున్న సినిమాలు చరణ్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో రావడంతో, టాలీవుడ్‌లో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.
మొత్తానికి సుకుమార్ రాబోయే రోజుల్లో పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.

