వెంకీ అట్లూరి టాలీవుడ్‌లో తనదైన సెన్సిబిలిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తొలి సినిమా **‘తొలిప్రేమ’**తో క్లాసిక్ డెబ్యూ ఇచ్చిన వెంకీ, ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ వంటి చిత్రాలు కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ, తన కథన శైలిని మాత్రం ఎక్కడా వదల్లేదు. ప్రేమ, భావోద్వేగాలు, రిలేషన్‌షిప్స్‌ను సున్నితంగా చూపించడమే అతని బలంగా మారింది.
‘సార్’ సినిమాలోనూ బోధనాత్మక వాతావరణంలో అందమైన ప్రేమకథను మిళితం చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘లక్కీ భాస్కర్’ మంచి విజయాన్ని అందుకోవడంతో వెంకీ అట్లూరి మార్క్ మరింత బలపడింది. ఎలాంటి కథ అయినా సరే, సెన్సిబిలిటీ మిస్ కాకుండా చూపించడమే అతడి సక్సెస్ ఫార్ములాగా మారింది.
ఇప్పుడతను కోలీవుడ్ స్టార్ సూర్య 46వ చిత్రంకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా కథా నేపథ్యం గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడన్న అంశం మాత్రమే హైలైట్ అవుతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా అందమైన ప్రేమకథగా రూపొందుతోందన్న ప్రచారం మొదలైంది. ఇందులో సూర్య సుమారు 45 ఏళ్ల వ్యక్తి పాత్రలో, మమితా బైజు మాత్రం 20 ఏళ్ల యువతిగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం ఎలా ప్రేమగా మారుతుంది? ఆ ప్రేమను ఎమోషనల్‌గా ఎలా చూపిస్తారు? అన్నదే కథలో కీలకంగా ఉంటుందట.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, వాస్తవ జీవితంలో సూర్య వయసు 50 కాగా, మమితా బైజు వయసు 24. సినిమాలో సూర్య వయసును 5 ఏళ్లు తగ్గించగా, మమితా వయసును 4 ఏళ్లు తగ్గించారు. అంటే 45 ఏళ్ల వ్యక్తి – 20 ఏళ్ల యువతి మధ్య ప్రేమ అనే అంశాన్ని వెంకీ అట్లూరి ఏ కోణంలో చూపిస్తాడన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి వయసు గ్యాప్ లవ్ స్టోరీలు చాలా సున్నితమైనవి. చిన్న తేడా జరిగినా తీవ్ర విమర్శలు ఎదురయ్యే అవకాశముంది. ఇటీవల ‘ధురంధర్’ సినిమా రిలీజ్‌కు ముందు, రణ్‌వీర్ సింగ్ – సారా అర్జున్ వయసు గ్యాప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రిలీజ్ తర్వాత సినిమా సైలెంట్ అయినా, ముందుగా మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది.
అందుకే సూర్య సినిమాపై కూడా అలాంటి వివాదాలు రాకుండా వెంకీ అట్లూరి చాలా జాగ్రత్తగా ఈ కథను డీల్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. సెన్సిబిలిటీతో, ఎమోషన్‌తో ఈ అంశాన్ని హ్యాండిల్ చేస్తే ఇది ఒక అందమైన ప్రేమకథగా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

