సినిమా ఇండస్ట్రీలో డ్రెస్సింగ్ సెన్స్, స్వేచ్ఛ, సంప్రదాయాల అంశంపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఓ సామాజిక కార్యకర్త, మదర్ ఫౌండేషన్ చైర్మన్‌గా తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేశారు.
తాను పార్టీలకు అతీతంగా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా మాట్లాడుతున్నానని పేర్కొన్న ఆమె, శివాజీ మాటల్లో భావం సరైందేనని స్పష్టం చేశారు. అయితే ఆయన మాట్లాడినప్పుడు ఒకటి రెండు పదాలు దొర్లాయని, అవి ఉపయోగించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ మొత్తం ఉద్దేశ్యం మాత్రం తప్పు కాదని అన్నారు.
అనసూయపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, వారికి రాని విమర్శలు నీకే ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలి” అని అన్నారు. తాను హీరోయిన్ కాదని, సైడ్ ఆర్టిస్ట్‌గా గుర్తించుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ‘నా శరీరం నా ఇష్టం’ అనే మాట ఇంటి వరకు సరైందే కానీ, రోడ్లపై, సమాజంలో అందరికీ అదే వర్తిస్తుందా అనే ప్రశ్నను లేవనెత్తారు.
అనసూయపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, వారికి రాని విమర్శలు నీకే ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలి” అని అన్నారు. తాను హీరోయిన్ కాదని, సైడ్ ఆర్టిస్ట్‌గా గుర్తించుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ‘నా శరీరం నా ఇష్టం’ అనే మాట ఇంటి వరకు సరైందే కానీ, రోడ్లపై, సమాజంలో అందరికీ అదే వర్తిస్తుందా అనే ప్రశ్నను లేవనెత్తారు.
స్వేచ్ఛను ఎవ్వరూ నిరాకరించడం లేదని, కానీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పిల్లలు చూసే విధంగా ప్రవర్తన ఉండాలన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఇతర దేశాలు కూడా గౌరవిస్తాయని, అలాంటి సంస్కృతిలో పుట్టిన మనం ఏం చూపిస్తున్నామన్నదే అసలు ప్రశ్న అని వ్యాఖ్యానించారు.
ఒళ్ళు చూపిస్తేనే హీరోయిన్ అన్న భావనను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. బాపు గారు గీసిన బొమ్మల్లో లాగా లంగా-ఓణి, చీరలో కూడా అందం ఉంటుందని గుర్తు చేశారు. గతంలో ‘మూగమనసులు’, ‘గోరింటాకు’ లాంటి సినిమాలు ఎంత సాంప్రదాయంగా ఉండి కూడా ఎంతటి విజయాలు సాధించాయో ఉదాహరణగా చెప్పారు.
శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ, ఆయన ఒక అన్నగా లేదా తమ్ముడిగా సలహా ఇచ్చారని తెలిపారు. ఒక హీరోయిన్ డ్రెస్సింగ్ వల్ల భవిష్యత్తు దెబ్బతినకూడదన్న ఆలోచనతోనే ఆయన మాట్లాడారని చెప్పారు. ఆ రెండు పదాలు తప్పితే మిగతా మాటల్లో అర్థం చాలా బాగుందని, తాను వాటిని అంగీకరిస్తున్నానని స్పష్టం చేశారు.
మొత్తానికి డ్రెస్సింగ్ స్వేచ్ఛ, మహిళల హక్కులు, సంస్కారం – ఈ మూడు మధ్య సమతుల్యత ఉండాలన్నదే తన వాదన అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

