వస్త్రధారణపై వ్యాఖ్యలు సిగ్గుచేటు: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలపై అంజలి ఫైర్

మహిళల వస్త్రధారణపై మీడియా ముందు జరుగుతున్న చర్చలు, వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని నటి అంజలి మండిపడ్డారు.
ఆడవారి శరీరాన్ని సామాన్లు, గిన్నెలు, చెంచాలతో పోల్చుతూ మాట్లాడటం అత్యంత నీచమైన ఆలోచనగా ఆమె అభివర్ణించారు.

“ముందు సిగ్గుపడడం నేర్చుకోండి”

మీడియా ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నవారు ముందుగా సిగ్గుపడడం నేర్చుకోవాలని అంజలి ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆడదాన్ని వస్తువులతో పోల్చడం అనేది ఆమె వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని పూర్తిగా విస్మరించినట్టేనని అన్నారు.

“మార్చాల్సిన నిజమైన విషయాలు చాలా ఉన్నాయి.
అవసరం లేని, వ్యర్థమైన విషయాలపై ఎందుకు మీ సమయాన్ని వృథా చేస్తారు?” అంటూ ప్రశ్నించారు.

కులం, జెండర్ పేరుతో మహిళల వినియోగం

చరిత్రలో ఎప్పటికప్పుడు

  • కులం పేరుతో
  • బానిసత్వం పేరుతో
  • జెండర్
  • వల్నరబిలిటీ

వంటి అంశాలను నెపంగా పెట్టుకొని మహిళలను వాడుకోవడమే జరుగుతోందని ఆమె విమర్శించారు.
ఒక మహిళకు సెల్ఫ్ రెస్పెక్ట్, వ్యక్తిత్వం ఉంటుందనే విషయాన్ని సమాజం గమనించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఈ డిస్కషన్ రోత పుట్టిస్తోంది”

ఈ తరహా డిస్కషన్లు తనకు చాలా అసహ్యంగా, రోత పుట్టించేలా ఉన్నాయని అంజలి చెప్పారు.
“మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు కదా.
వాళ్లపై ఇలాంటి మాటలు ఎంత గాయాన్ని కలిగిస్తాయో ఆలోచించండి” అంటూ మీడియా, వ్యాఖ్యాతలను ఉద్దేశించి మాట్లాడారు.

సెలబ్రిటీలపై దాడులపై చర్యలు లేవు

ఈ వేదిక తరఫున మరో కీలక అంశాన్ని అంజలి లేవనెత్తారు.
నిధి అగర్వాల్, సమంత వంటి సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులపై ఇప్పటివరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు.

మొదటగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,
రెండోది పబ్లిక్ ఈవెంట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

“సామాన్లు అనే మాటే దరిద్రం”

ఆడదాన్ని “సామాన్లు” అని పిలవడం అత్యంత దారుణమని,
ఆ దరిద్ర ఆలోచనలకు వేదికలు కల్పించడం ఇంకా దారుణమని అంజలి వ్యాఖ్యానించారు.
ఇలాంటి మాటలు మాట్లాడేవారు ముందు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని ఆమె సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *