బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
వారు పేర్కొంటూ — “చెట్టబద్ధత కల్పించి 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి, 15 నెలలు నిద్రపోయారు. చివరి రెండు నెలల్లో హడావుడిగా చూపులు పెడుతున్నారు. కానీ చట్టం లేకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?” అని ప్రశ్నించారు.
తమ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగ సవరణ ద్వారానే రిజర్వేషన్ సాధ్యమని చెబుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, సుప్రీంకోర్టులో కూడా కాంగ్రెస్ మంత్రులు వాదనలు సరైన ఆధారాలతో చెప్పలేకపోయారని ఆరోపించారు.
అదేవిధంగా, “బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా కోర్టులు ఇలాంటి నిర్ణయాలను కొట్టివేశాయి. కాబట్టి తెలంగాణలోనూ అదే జరుగుతుందని ముందుగానే తెలిసి కూడా ప్రజలను మోసం చేస్తున్నారు” అని విమర్శించారు.
ప్రజలు, ముఖ్యంగా బీసీలు, ఇప్పుడు రాజకీయ అవగాహనతో ఉన్నారని, ఇక మోసపోరని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు కూడా ఈ బంద్కు మద్దతుగా రావాలని పిలుపునిచ్చారు.
“ఈ బంద్ తెలంగాణ ఉద్యమ తరహాలో జరగాలి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి” అని పిలుపునిచ్చారు.

