బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట–వర్తనం పొరపాటు: వాగ్ధానం 42%, అమలు 17%

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 17 శాతానికే పరిమితం కావడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. జీవో 9 అమల్లో ఉండగానే జీవో 46ను కోర్టు విచారణ పూర్తికాకుండానే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం రాజకీయ ప్రయోజనాలకేనా అనే ప్రశ్న బీసీ వర్గాల్లో ఉధృతమైంది.

హైకోర్టు ఆదేశాలే కారణమని ప్రభుత్వం చెబుతున్నా, రెండు నెలల డెడ్‌లైన్ గడిచిన తర్వాతే హడావుడిగా నెపం నెట్టడం రాజకీయ యత్నమని బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్పష్టంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించగా, ఇప్పుడు ఆయన మౌనం మరియు పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం బీసీ వర్గాల్లో అసంతృప్తి పెంచుతోంది.

రాష్ట్రంలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్, “మేము కేంద్రంలో ఉన్నుంటే గంటలో ఇచ్చేవాళ్లం” అని చెప్పడం ప్రజల భావాలను ఆటలాడుకోవడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర పరిధిలోనే ఉన్న పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు అమలు చేయడంలో వైఫల్యం ప్రజలకు అర్థం కావడం లేదు.

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ “మేము 42% ఇవ్వాలని ప్రయత్నించాం, కానీ BJP సహకరించలేదు” అని వ్యాఖ్యానించారు. అయితే బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి—“42% ఇవ్వడానికి కేంద్రం

క్యాబినెట్ సమావేశంలోనే 17%కి కుదించినప్పుడు బీసీ మంత్రులు నోరు పొడచారని విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

బీసీ సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహంతో నిలదీస్తూ—
👉 ఒక పనిచేసే జీవో వెంటనే తీసుకురావాలి
👉 లేక మంత్రులు రాజీనామా చేసి 42% కోసం పోరాడాలి
అని డిమాండ్ చేస్తున్నారు.

అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే—
📌 కాంగ్రెస్ చెప్పింది హామీ?
లేక ప్రచారానికి పెట్టిన రాజకీయ పాన్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *