నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
డిసిసి అధ్యక్షుడిగా నియమితుడైన కైలాస్ నేత వెనుక ఉన్న బలగం ఎవరు?
అతనికి ఆ పదవి ఎవరు ఇప్పించారు? అనే అంశంపై మంత్రి కోమట రెడ్డి వెంకట రెడ్డి ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
కైలాష్ నేత గతంలో తనను వ్యక్తిగతంగా దూషించిన విషయం మరచిపోలేకపోతున్నారని కోమటరెడ్డి వర్గాలు చెబుతున్నాయి.
అలాంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంపై కోమటరెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసి, కైలాష్ను పదవి నుంచి తప్పించి కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
మంత్రి అనుచరులు సైతం అధిష్టానానికి కైలాస్పై వేర్వేరు ఫిర్యాదులు పంపి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గత అసంతృప్తులు కూడా కారణమే?
జూబ్లీ హిల్స్ సంబంధిత సమావేశానికి ముఖ్యమంత్రి తనను పక్కన పెట్టి సినీ కార్మికులతో మీటింగ్ పెట్టిన విషయం గుర్తుండాల్సిందే.
అప్పుడు కూడా కోమటరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఆ సమయంలో పెద్దగా ఎలాంటి చర్యలు జరుగలేదు.
తర్వాత అదే కోమటరెడ్డి ప్రచారంలో పాల్గొనడం గమనార్హం.
ఇక కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు?
పార్టీ అంతర్గతంగా:
“తాత్కాలిక కోపం… తర్వాత బుజ్జగింపు… తర్వాత మళ్లీ సాధారణం…”
అనే ఫార్ములా పనిచేస్తుందని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.
అయితే ఈసారి పరిస్థితి వేరు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
కైలాస్ నియామకంతో నల్గొండ కాంగ్రెస్లో కొత్త శక్తి సమీకరణలు కనిపిస్తున్నాయి.
నల్గొండ కాంగ్రెస్లో సాగుతున్న ఈ అంతర్గత తగాదాలు ఎక్కడికి దారితీస్తాయి?
కైలాష్ పదవి కాపాడుకుంటారా?
లేక కోమటరెడ్డి ఒత్తిడికి పార్టీ అధిష్ఠానం లోబడుతుందా?
అన్న ప్రశ్నలకు సమాధానం కోసం అందరి చూపు వేటి మీదో కాదు—
గాంధీభవన్ వైపు!

