జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈసారి పోరు ప్రధానంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యే జరగనుంది. బీజేపీ ప్రభావం ఈ ప్రాంతంలో తక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే రెండు పార్టీలు కూడా సెటిలర్ ఓటు బ్యాంక్ పై దృష్టి సారించాయి. ఈ ఓట్లు ఏ వైపుకు మళ్లతాయన్నది గెలుపు ఓటములపై కీలక ప్రభావం చూపనుంది.
సమాచారం ప్రకారం, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఇటీవల టిడిపి నాయకుడు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టిడిపి ఓట్లు విభజించకుండా బీఆర్ఎస్ వైపు మళ్లించే వ్యూహంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమ్మ సంఘ నాయకులతో భేటీ అయి, ఆ వర్గం ఓట్లు కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో కూడా టిడిపి కాంగ్రెస్ కి పరోక్ష మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది. అయితే ఈసారి కమ్మ సంఘం + టిడిపి ఓట్లు కాంగ్రెస్ వైపుకు ఏకమైతే ఫలితాలు మారే అవకాశం ఉందని అంచనా.
ఇక మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ సినీ కార్మికులకు 10 కోట్ల వెల్ఫేర్ ఫండ్ ప్రకటించి, కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ పాఠశాల నిర్మాణం హామీ ఇచ్చారు. అయితే ప్రజల్లో కొందరు ఈ హామీలను ప్రశ్నిస్తున్నారు.
ప్రజల అభిప్రాయం ప్రకారం,
“ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో తిండి, వసతులు, టీచర్ల కొరతలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అవి సరిచేయకుండానే కొత్త స్కూల్ మాటలు ఎందుకు?”
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొత్తంగా చూస్తే, జూబ్లీహిల్స్ లో ఈసారి బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య గట్టి పోరు, టిడిపి ఓట్లు ఎటు మళ్లతాయన్నది హాట్ టాపిక్ గా మారింది.

