హైదరాబాద్‌లో జనసేన తొలి కార్యాలయం.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహానికి శ్రీకారం?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైదరాబాద్‌లో జనసేన పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించడం వెనుక కేవలం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడమే కాకుండా, భవిష్యత్ రాజకీయ విస్తరణకు బలమైన వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా…

