కొండా సురేఖ కుటుంబం పై కుట్రలు జరుగుతున్నాయి – సుష్మిత భావోద్వేగ ప్రసంగం

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల వేళ బీఆర్ఎస్ నేత కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన లైవ్ వీడియోలో వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె మాట్లాడుతూ, తన కుటుంబం పై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, ముఖ్యంగా కొందరు అధికారులు మరియు రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు అవినీతిలో పాల్గొంటున్నారని ఆరోపించారు.

సుష్మిత గారు మాట్లాడుతూ – “సెక్రటేరియట్‌లో కూర్చోబెట్టి దందాలు చేస్తున్న మార్కెటింగ్ మేనేజర్లు, పిఎలు, పిఆర్ఓలు… వీరంతా ప్రభుత్వ పేరుతో లాబీయింగ్ చేస్తున్నారు” అని అన్నారు.

ఆమె రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ – “ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్న పిఏలు, ప్రోటోకాల్ అధికారులు దందాలు చేస్తున్నారు. ఒక్కొక్కరి అవినీతి బయట పెడతాం” అని హెచ్చరించారు.

అలాగే ఎండోవ్మెంట్ శాఖలో అవినీతి జరుగుతోందని పేర్కొంటూ – “ఎండోవ్మెంట్ ఆఫీస్‌లో కరెంట్ బిల్లు కూడా కట్టలేని స్థితి వచ్చింది. కానీ లాబీయింగ్ చేసేవాళ్లు కోట్ల రూపాయల దందాలు చేస్తున్నారు” అని ఆరోపించారు.

సుష్మిత గారు పోలీసు ముట్టడిపై స్పందిస్తూ – “నా ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు, కానీ నేను భయపడను. నిజం చెప్పడానికి జైలుకెళ్లాల్సి వస్తే వెళ్తా. కార్యకర్తల మనోధైర్యం కోల్పోకండి” అని పేర్కొన్నారు.

ఆమె మరింతగా మాట్లాడుతూ – “నేను చిన్నప్పటి నుంచీ ఫైటర్‌ని. ఈరోజూ ఎవరూ నన్ను అడ్డుకోలేరు. ఎవరు సత్యం మాట్లాడినా వాళ్లను టార్గెట్ చేస్తున్నారు” అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *