రూ.10కి కొనే మందు రూ.180కి అమ్మకం: ఔషధ సిండికేట్‌తో సామాన్యులపై భారీ భారం

రూ.10కి కొనే మందు రూ.180కి అమ్మకం: ఔషధ దందాతో సామాన్యుల జేబులు ఖాళీ

దేశంలో ఔషధాల ధరలు సామాన్య ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. రోజూ వాడే సాధారణ మెడిసిన్ టాబ్లెట్లు రూ.10కు తయారీదారుల నుంచి బయటకు వస్తే, అదే మందు రూ.150 నుంచి రూ.180 వరకు అమ్ముతున్న వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఔషధ వ్యాపారం ఒక సిండికేట్‌లా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా గ్యాస్, ఎసిడిటీ, అలర్జీ వంటి చిన్న సమస్యలకే ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ మొత్తం ప్రిస్క్రిప్షన్ రాస్తాడని, ఆ మందులన్నీ కొనాలంటే రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఖర్చవుతోందని రోగులు వాపోతున్నారు. వాస్తవానికి ఆ మందుల తయారీ ఖర్చు కొన్ని వందల రూపాయలే అయినా, మార్కెట్లో మాత్రం వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ దందాలో ఔషధ కంపెనీలు, మార్కెటింగ్ చైన్లు, మెడికల్ షాపులు కలిసి ఒకే రేటును ఫిక్స్ చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సామాన్యులు ప్రశ్నించే స్థితిలో లేరు. మందులు కొనక తప్పని పరిస్థితిలో ఉండటంతో ధర ఎంతైనా భరించాల్సి వస్తోంది. ఈ వ్యాపారంలో పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలకు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం.

పార్లమెంటరీ కమిటీ షాకింగ్ రిపోర్ట్

ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ విడుదల చేసిన నివేదిక విస్తుగొలిపే నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. సాధారణంగా వాడే ఔషధాలపై ఫార్మా కంపెనీలు 600 శాతం నుంచి 1800 శాతం వరకు లాభాలు ఆర్జిస్తున్నట్లు కమిటీ పేర్కొంది.

ఉదాహరణకు:

  • అలర్జీ మందు నెటిజిన్ తయారీ ధర రూ.2–3 కాగా, మార్కెట్‌లో ఎంఆర్పీ రూ.21–22గా ఉంది. అంటే దాదాపు 950–1000% లాభం.
  • ఎసిడిటీ మందు పాంటోప్రాజోల్ తయారీ ధర రూ.10–25 మాత్రమే కాగా, ఎంఆర్పీ రూ.100–180 వరకు ఉంది. అంటే 600–900% మార్జిన్.
  • కాల్షియం, విటమిన్ D3 మాత్రల తయారీ ధర రూ.17 మాత్రమే కాగా, ఎంఆర్పీ రూ.327 వరకు వసూలు చేస్తున్నారు. ఇది దాదాపు 1800% లాభంగా మారుతోంది.

ఈ భారీ ధరల వల్ల దేశంలో ప్రజల వైద్య ఖర్చుల్లో మందుల వాటా అత్యధికంగా పెరిగిందని కమిటీ స్పష్టం చేసింది. చికిత్స కంటే మెడిసిన్ ఖర్చే ఎక్కువగా మారిందని పేర్కొంది.

నియంత్రణ లేకపోవడమే అసలు కారణం

నాన్-షెడ్యూల్డ్ డ్రగ్స్‌పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని కమిటీ అభిప్రాయపడింది. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్–2019లో ఈ మందులపై ట్రేడ్ మార్జిన్ నియంత్రణ లేకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా ధరలు పెరుగుతున్నాయని తెలిపింది.

గతంలో క్యాన్సర్ ఔషధాలు, కోవిడ్ సమయంలో మెడికల్ డివైజెస్‌పై ట్రేడ్ మార్జిన్ నియంత్రణ తీసుకురావడంతో ధరలు సుమారు 50% తగ్గిన సందర్భాలు ఉన్నాయని కమిటీ గుర్తు చేసింది. అయినా, ఔషధాల ధరలపై శాశ్వత విధానాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకురాలేదని విమర్శించింది.

జెనరిక్ ఔషధాల పరిస్థితి కూడా అంతేనా?

భారతదేశం ప్రపంచానికి తక్కువ ధరకు జెనరిక్ ఔషధాలను ఎగుమతి చేస్తుండగా, దేశంలో మాత్రం అదే మందులు ఖరీదుగా మారడం విడ్డూరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. జన్ ఔషధి కేంద్రాల్లో జెనరిక్ మందులు బ్రాండెడ్ మందుల కంటే 80% వరకు తక్కువ ధరకు లభిస్తున్నా, అన్ని మందులు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.

కొన్ని చోట్ల జెనరిక్ మెడికల్ షాపుల పేరుతో కూడా అదే బ్రాండెడ్ మందులను అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా గట్టి పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

పరిష్కారం ఏంటి?

ఔషధాల ధరల్లో పారదర్శకత తీసుకురావాలంటే తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపుల నుంచి రియల్‌టైమ్ ధరల డేటాను సేకరించే బలమైన యంత్రాంగం ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ప్రతి మెడిసిన్‌కు స్పష్టమైన ధర పట్టికను మెడికల్ షాపుల్లో ప్రదర్శించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

లేదంటే, రూ.10కి కొనే మందు రూ.180కి అమ్మే ఈ దందా ఇలాగే కొనసాగుతూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *