పల్లవి విల్ల రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పు సాధ్యం కాదు: సభలో ప్రభుత్వ స్పష్టీకరణ

పల్లవి విల్ల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన రోడ్ వైడనింగ్ అంశాన్ని గౌరవ సభ్యులు హరీష్ బాబు శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ విస్తరణలో భాగంగా ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌పై ఆలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఒక వైపు డిఫెన్స్ ల్యాండ్, మరో వైపు సరస్సు ఉండటంతో ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్ వల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ప్రభుత్వం, ఈ రోడ్ అలైన్‌మెంట్ అంశాన్ని గతంలోనే పలుమార్లు పరిశీలించామని స్పష్టం చేసింది. అయితే ఒక వైపు సరస్సు, మరో వైపు డిఫెన్స్ భూమి ఉండటంతో ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌కు అవకాశం లేకుండా పోయిందని తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉండటంతో రీ-అలైన్‌మెంట్ సాధ్యం కాదని గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొచ్చింది.

అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్‌ల అంశంపై కూడా ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. పారడైస్ నుంచి డైరీ ఫామ్, అలాగే పారడైస్ నుంచి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రిని పలుమార్లు కలిశారని వెల్లడించారు. డిఫెన్స్ ల్యాండ్ బదిలీకి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం ఫైనల్ దశలో ఉందని తెలిపారు.

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టే షామీర్పేట–పారడైస్ ఎలివేటెడ్ కారిడార్ పనులను అతి త్వరలో ప్రారంభించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులు నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా క్వశ్చన్ నెంబర్ 1349కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సభలో స్పందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *