టాలీవుడ్ స్టార్ల సైడ్ బిజినెస్‌లు.. సినిమాలతో పాటు కోట్ల లాభాల దందా

సినీ రంగంలో స్టార్‌డమ్ ఎంత వేగంగా మారుతుందో, భవిష్యత్తు భద్రత కోసం తెలివైన పెట్టుబడులు పెట్టడం కూడా అంతే అవసరం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న టాలీవుడ్ స్టార్లు సినిమాల్లో భారీ పారితోషికాలు అందుకోవడమే కాదు, వ్యాపార రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, థియేటర్లు, స్టార్టప్‌లు, టెక్ రంగాల్లో కోట్ల పెట్టుబడులతో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారుతున్నారు.

కింగ్ నాగార్జున
వ్యాపారాల్లో దిట్టగా పేరొందిన నాగార్జున అక్కినేని సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టూడియో ఫిల్మ్‌మేకింగ్‌కు అనువైన అన్ని సదుపాయాలతో ప్రసిద్ధి చెందింది. అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ద్వారా సినీ విద్యకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు కూడా నాగార్జున వ్యాపారాల్లో భాగం.

విక్టరీ వెంకటేష్ – దగ్గుబాటి కుటుంబం
సురేష్ ప్రొడక్షన్స్‌తో సినీ పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న దగ్గుబాటి కుటుంబం వ్యాపార రంగంలోనూ బలమైన పట్టు కలిగి ఉంది. వెంకటేష్ EV స్టార్టప్ ‘వైక్ వూ’లో పెట్టుబడిదారుడిగా ఉన్నారు. రానా దగ్గుబాటి టెక్, మీడియా స్టార్టప్‌లలో పెట్టుబడులతో పాటు KWAN టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు సహ వ్యవస్థాపకుడు. అమర్ చిత్ర కథ కామిక్ బుక్ కంపెనీ నిర్వహణ కూడా రానా చేతుల్లోనే ఉంది.

అల్లు అర్జున్
హైదరాబాద్‌లో బఫెలో వైల్డ్ వింగ్స్ (B-Dubs) ఫ్రాంచైజీ ద్వారా బన్నీ బార్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. 800 జూబ్లీ పేరుతో పబ్‌ను కూడా నడుపుతున్నారు. AAA సినిమాస్‌తో మల్టీప్లెక్స్ రంగంలోకి ప్రవేశించి ఘన విజయం సాధించారు. గీతా ఆర్ట్స్, ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ భాగస్వామిగా ఉన్నారు.

మహేష్ బాబు
బ్రాండ్ అంబాసిడర్‌గా భారీగా సంపాదించే మహేష్ బాబు, థియేటర్ల వ్యాపారంలోనూ సక్సెస్ అయ్యారు. గచ్చిబౌళిలో ఏఎంబీ సినిమాస్ సూపర్ హిట్ కాగా, బెంగళూరులోనూ విస్తరించారు. ‘ది హంబుల్ కో’ పేరుతో మెన్స్ వేర్ బ్రాండ్‌ను నడుపుతున్నారు.

రామ్ చరణ్
ట్రూజెట్ ఎయిర్‌లైన్స్‌తో విమానయాన రంగంలోకి ప్రవేశించిన చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ యజమానిగా ప్రత్యేక గుర్తింపు ఉంది.

ప్రభాస్ & ఇతరులు
ప్రభాస్ మల్టీప్లెక్స్ థియేటర్ చైన్‌లో పెట్టుబడులు పెట్టగా, నేచురల్ స్టార్ నాని ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌తో నిర్మాతగా రాణిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్, హీరో ఆర్య వంటి వారు కూడా థియేటర్లు, రెస్టారెంట్లు, ప్రొడక్షన్ హౌస్‌లతో వ్యాపారాల్లో ముందున్నారు.

సినీ గ్లామర్ శాశ్వతం కాదన్న వాస్తవాన్ని గుర్తించిన టాలీవుడ్ ప్రముఖులు, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, టెక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తును భద్రపరుచుకుంటున్నారు. సినిమాలకే కాకుండా వ్యాపారాల్లోనూ స్టార్‌డమ్ ఎలా నిలబెట్టుకోవాలో వీరే ఉదాహరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *