రేవంత్ ప్రభుత్వ సెలబ్రేషన్స్‌పై విమర్శల వర్షం – ఉద్యమకారులకు హామీలు ఎక్కడ?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సెలబ్రేషన్లపై వివాదం చెలరేగింది.
ప్రభుత్వం ఈ వేడుకల కోసం ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (I&PR) విభాగం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓకే టీవీ యాంకర్ శ్రావ్య ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమె మాట్లాడుతూ –

“డబ్బులు లేవు, పైసలు లేవు అని చెప్పే ప్రభుత్వం, సెలబ్రేషన్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు. అదే డబ్బుతో ఆ హామీలను నెరవేర్చండి” అని మండిపడ్డారు.

తాజాగా బయటకు వచ్చిన ఆర్టీఐ సమాచారం ప్రకారం,

టెలంగాణ ప్రభుత్వం ఒకే సంవత్సరపు విజయోత్సవ ప్రకటనల కోసం సుమారు ₹34.98 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఈ మొత్తం ప్రధానంగా అవుట్డోర్ మీడియా, పేపర్ అడ్వర్టైజ్‌మెంట్లు, మరియు టెలివిజన్ పబ్లిసిటీకి వినియోగించినట్లు సమాచారం.

శ్రావ్య మాట్లాడుతూ,

“మా ఉద్యమకారుల హక్కులు, నిరుద్యోగుల ఉద్యోగాలు, రైతుల సాయం – ఇవన్నీ పక్కనపెట్టి మీరు మీ పార్టీ ప్రచారం కోసం ప్రజల సొమ్ముతో సెలబ్రేషన్లు చేస్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, వ్యక్తిగత ప్రచారం”
అని విమర్శించారు.

అలాగే ఆమె కాంగ్రెస్ నాయకత్వాన్ని ఉద్దేశించి –

“రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు మీరు నిజంగా ప్రజా నాయకులైతే మీ జేబు నుంచి ఖర్చు పెట్టండి. ప్రజల పన్నుల డబ్బు వృథా చేయకండి”
అని హితవు పలికారు.

ఆమె ప్రభుత్వాన్ని మరోసారి ప్రశ్నిస్తూ,

“మా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఈ సెలబ్రేషన్లు అర్ధంలేనివి.
మీరు ప్రజల సొమ్ము దానం చేస్తున్నారా లేక రాజకీయ ఫండ్ వాడుతున్నారా?”
అని ప్రశ్నించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వ ఖర్చులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఉద్యమకారులు, నిరుద్యోగులు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది తమ హక్కులు కోరుతుంటే – సెలబ్రేషన్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడమేంటని విమర్శిస్తున్నారు.

మొత్తానికి,
“ప్రజల సొమ్ముతో ప్రభుత్వ ప్రచారం” అనే ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
శ్రావ్య మాటల్లో –

“ప్రజల కోసం మాట్లాడేవారిని భయపెట్టొచ్చు, కానీ ప్రజల గొంతు మూయలేరు”
అని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *