జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయానికి సీఎం రేవంత్ ఆరు అస్త్రాలు – కాంగ్రెస్ విజయరహస్యం ఇదే!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ముఖ్యంగా హైదరాబాదు నగర హృదయంలో ఉన్న ఈ నియోజకవర్గం, వివిధ సామాజిక వర్గాలు, ముస్లిం ఓటర్లు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు, బస్తీల్లోని పేద మధ్యతరగతి వరకూ విభిన్నంగా ఉన్న ఓటర్ల సెంటిమెంట్లను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో, సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఆరు కీలక అస్త్రాలు ప్రయోగించారు. ఈ ఆస్త్రాల సమ్మేళనమే కాంగ్రెస్‌కు బలమైన వాతావరణం సృష్టించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

1. బీసీ అభ్యర్థి ఎంపిక – స్థానికత + సామాజిక న్యాయం కార్డ్

జూబ్లీహిల్స్‌లో బీసీ వర్గం ఓటర్లు గణనీయంగా ఉండటంతో, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్థి నవీన్ కుయార్‌ను బరిలోకి దింపింది.
ఇది స్థానికత, సామాజిక న్యాయం, మైనారిటీ–బీసీ సమీకరణాలపై పెద్ద ప్రభావం చూపింది.
ఈ నిర్ణయం ద్వారా బీసీ వర్గాల్లో కాంగ్రెస్ మీద అనూహ్యమైన పాజిటివ్ వాతావరణం ఏర్పడింది.

. ముస్లిం ఓటర్ల సమీకరణ – అజారుద్దీన్ కార్డ్

జూబ్లీహిల్స్‌లో లక్షకు పైన ముస్లిం ఓటర్లు ఉన్నారు.
వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి సరైన సమయంలో మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా మైనారిటీ ఓటు బ్యాంకులో పెద్ద ఎత్తున మార్పు చోటుచేసుకుంది.
ఈ నిర్ణయం ప్రచార చివరి దశలో కాంగ్రెస్‌కు స్పష్టమైన బూస్ట్ అందించింది.

3. ఎన్టీఆర్ విగ్రహ హామీ – సెటిలర్స్ & కమ్మ వర్గంపై లక్ష్యం

సెటిలర్స్, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కమ్మ వర్గం ఓటర్లు జూబ్లీహిల్స్‌లో మంచి ప్రభావం కలిగి ఉన్నారు.
వారి భావోద్వేగాలను గుర్తించిన రేవంత్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా సెటిలర్స్ కమ్యూనిటీలో పెద్ద మద్దతు పొందడంలో విజయవంతమయ్యారు.
టీడీపీ శ్రేణుల నుండి కూడా కాంగ్రెస్‌కు అనూహ్యమైన మద్దతు అందినట్టు ప్రచార వర్గాలు చెబుతున్నాయి

. సినీ పరిశ్రమతో ప్రత్యేక ఫోకస్ – దగ్గరదనపు స్ట్రాటజీ

జూబ్లీహిల్స్ ప్రాంతం సినీ ప్రముఖుల కేంద్రంగా ప్రసిద్ధి.
సీఎం రేవంత్ సినీ కార్మికులు, సంఘాలు, ప్రముఖులతో వరుసగా సమావేశాలు చేసి వారి సమస్యలను విన్నారు.
ఆ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీలివ్వడంతో ఈ వర్గం మీద కూడా కాంగ్రెస్ మంచి ప్రభావం చూపగలిగింది.

5. బస్తీల్లో పేదలపై దృష్టి – అభివృద్ధి vs నిర్లక్ష్యం నేరుగా చూపించడం

నియోజకవర్గంలో పలు బస్తీలు, మురికివాడలు ఉన్నప్పటికీ, గత పదేళ్ల పాలనలో నిజమైన అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి ప్రచారంలో చురుకుగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ గెలిస్తే బస్తీ సమస్యలను “యుద్ధ ప్రాతిపదికన” పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంలో విజయం సాధించారు.
దీంతో పేద మరియు మధ్యతరగతి ఓటర్లలో కాంగ్రెస్ వైపు తేలికపాటి గాలులు వీచాయి.

డివిజన్‌వారీ ప్రచార నిర్వహణ – గ్రౌండ్ మేనేజ్మెంట్ లో టాప్ క్లాస్

ఈ ఉపఎన్నికను వ్యక్తిగత ప్రతిష్టగా భావించిన సీఎం రేవంత్, మంత్రులు–ఎమ్మెల్యేలు–ఎమ్మెల్సీలకు మొత్తం నియోజకవర్గాన్ని డివిజన్‌వారీగా బాధ్యతలు అప్పగించారు.
సర్వే ఆధారంగా వ్యూహాలు మారుస్తూ, చివరి నిమిషం వరకూ రోడ్‌షోలు, మీట్ ది ప్రెస్, మీడియా సమావేశాలతో స్వయంగా ప్రచారాన్ని వేగవంతం చేశారు.
ఈ “వార్ప్-స్పీడ్ క్యాంపెయినింగ్”ే కాంగ్రెస్‌కు గెలుపు దిశగా బలమైన ప్రేరణగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *