సందీప్ కిషన్ ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ అదిరింది – పవర్‌ఫుల్ మోడ్‌లో హీరో!

యంగ్ హీరో సందీప్ కిషన్ మరోసారి తన ప్రత్యేకమైన స్క్రిప్ట్ సెలెక్షన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘మజాకా’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సందీప్, ఇప్పుడు పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘సిగ్మా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ అన్యాయమైన ప్రపంచంలో కూడా మీ వ్యక్తిత్వాన్ని మీరు వదులుకోనప్పుడు మీరు సిగ్మా” — అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌తో పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో సందీప్ కిషన్ బంగారు కడ్డీలు, నోట్ల కట్టలపై కూర్చొని గంభీరంగా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూస్తే హీరో పాత్ర చాలా ధైర్యవంతమైనదిగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన మార్గం వదలని వ్యక్తిగా ఉండబోతుందనే సంకేతాలు ఇస్తోంది.

పోస్టర్ డిజైన్‌లో డబ్బు, అధికారం, అహంకారం లాంటి అంశాలను ప్రతిబింబించేలా చేసిన తీరు ఆకట్టుకుంటోంది. సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఉంటుందని, సిస్టమ్‌కి వ్యతిరేకంగా ఒక సాధారణ వ్యక్తి పోరాటం అనే కథాంశం చుట్టూ తిరిగే అవకాశముందని ఫిల్మ్ యూనిట్ తెలిపింది.

సందీప్ కిషన్ కెరీర్‌లో గత కొన్నేళ్లుగా వేరువేరు రకాల పాత్రలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. నారగాసూరన్, మైఖేల్ వంటి సినిమాల తర్వాత ఇప్పుడు సిగ్మా ద్వారా ఆయన మరింత మాస్ యాక్షన్ షేడ్స్ చూపించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఫస్ట్ లుక్‌తోనే సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి.

త్వరలో టీజర్, రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *