అప్పులు, మౌనం, స్వార్థం: తెలంగాణను ఎవరు అడుగుతున్నారు?

అప్పులు, మౌనం, స్వార్థం: తెలంగాణను ఎవరు అడుగుతున్నారు?

తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం నడుస్తోంది.
ప్రజలకు సమస్యలు ఉన్నాయి, రాష్ట్రానికి ఆర్థిక సంక్షోభం ఉంది, కానీ అధికారంలో ఉన్నవాళ్లు మాత్రం ఎవరి స్వార్థంలో వాళ్లు బిజీ.

బీజేపీకి తెలంగాణ గుర్తొచ్చిందా ఇప్పుడే?

మెస్సీ వచ్చి ఫుట్‌బాల్ ఆడినప్పుడు కూడా నిద్రపోయిన బీజేపీ నాయకత్వం, ఇప్పుడు ఒక్కసారిగా మేల్కొంది.
పక్కనే ఉన్న కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు —
అప్పుడెప్పుడో యాక్షన్ తీసుకోవచ్చుగా?

నైనీ బ్లాక్ రద్దు చేసారు — సంతోషమే.
కానీ ఇంత ఆలస్యంగా ఎందుకు?
ఇన్నాళ్లు నిద్ర ఎందుకు?

ఇది పోరాటమా?
లేదా రాజకీయ టైమింగ్ చూసి చేసే డ్రామానా?

కాంగ్రెస్ ప్రభుత్వంలో లోపలే లోపల కల్లోలం

ఇప్పుడు అసలు విషయానికి వస్తే —
కాంగ్రెస్ ప్రభుత్వం లోపలే బాగా కంపిస్తోంది.

ఎంఎల్ఏలు అసంతృప్తిగా ఉన్నారు.
నిధులు లేవు.
బిల్లులు క్లియర్ కావడం లేదు.

కానీ దోచుకున్నది మాత్రం మంత్రులకే పరిమితం అవుతోంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎంఎల్ఏలు కూడా అమాయకులు కాదు — వాళ్లకూ కమిషన్లు కావాలి.
అందుకే ఫండ్స్ కోసం వాళ్లలో వాళ్లే కొట్లాట.

ప్రజల కోసం మాత్రం ఎవ్వరూ రోడ్డెక్కడం లేదు.

ప్రజల కోసం కొట్లాడితే దేవుళ్లు అయ్యేవారు…

నిజంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడితే —
ఈ రోజు వాళ్లు దేవుళ్లుగా పూజింపబడేవారు.

కానీ ఏం జరుగుతోంది?
వ్యక్తిగత కంపెనీల కోసం,
కన్స్ట్రక్షన్ ఫర్మ్‌ల కోసం,
కొడుకుల టెండర్ల కోసం,
ఆస్తుల కోసం రాజకీయాలు.

తెలంగాణ ప్రజల కోసం కాదు —
తెలంగాణ అస్తిత్వం కోసం కాదు.

మద్యం షాపుల విషయంలో దొంగ నాటకాలు

మేనిఫెస్టోలో ఏమన్నారు?
👉 బెల్ట్ షాపులు తొలగిస్తాం.

వాస్తవం ఏమిటి?
ఊరికో బెల్ట్ షాప్,
గల్లీకో గల్లి మద్యం దుకాణం.

రాజగోపాల్ రెడ్డి ఒక నియంత్రణ పెట్టేందుకు ప్రయత్నం చేశాడు —
ఒంటి గంట తర్వాతే షాపులు ఓపెన్ చేయాలని.

మంచి పని చేసినప్పుడు మెచ్చుకోవాలి.
కానీ ఇక్కడ ఏం చేశారు?
అడ్డుకున్నారు.
పదవి ఇవ్వలేదు.
ఒంటరిగా వదిలేశారు.

ప్రజలు ఎక్కడికి పోవాలి?

ఇలా నియంత్రణ లేకుండా మద్యం,
ఉద్యోగాలు లేవు,
భృతులు లేవు,
నిత్యావసరాలు పెరిగిపోయాయి.

ప్రజలు ఎక్కడికి పోవాలి?
ఎలా బతకాలి?

ఇది పాలనా వైఫల్యమా?
లేదా ప్రజలను మెల్లగా చంపే విధానమా?

ప్రశ్నలు అడగడం నేరమైతే…

ఈరోజు అడగాల్సిన ప్రశ్నలు ఇవి:

  • భట్టి విక్రమార్క హాస్పిటల్ ఇన్వెస్ట్‌మెంట్లు ఎలా వచ్చాయి?
  • ఉత్తమ్ కుమార్ రెడ్డికి డెక్కన్ సిమెంట్స్ షేర్లు ఎలా వచ్చాయి?
  • హర్యానాలో ఈడీ ఎందుకు వెళ్లింది?
  • ఈడీ ప్రజల కోసం వెళ్లిందా?
  • మహాలక్ష్మి పథకం కోసం వెళ్లిందా?
  • నిరుద్యోగ భృతి కోసం వెళ్లిందా?

లేదే కదా.

కులాల మంటలు – రాజకీయాల ఆయుధం

ఇక్కడ ఇంకో ప్రమాదకరమైన ఆట జరుగుతోంది.
కులాల పేరుతో రాజకీయాలు.

ఒక వర్గాన్ని చూపించి,
మిగతా వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం.

తెలంగాణలో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు —
అందరూ ఉన్నారు.
ఇది ఎవరి రాష్ట్రం కాదు —
అందరి రాష్ట్రం.

కులాల కాడ నిప్పు పెట్టితే,
మిగిలేది బూడిద మాత్రమే.

ముగింపు: తెలంగాణ పని ఖతమా?

ఇప్పుడు ప్రజలు ఆశతో చూస్తున్నారు.
కనీసం వచ్చే నాయకుడు అయినా మంచిగా వస్తాడేమో అని.

పూజలు కాదు,
ప్రసాదాలు కాదు —
ప్రజలకు జవాబులు కావాలి.

రేవంత్ రెడ్డి తిరిగివచ్చేలోపలే,
ఇక్కడ చాలా జరుగుతోంది.

ఇది రాజకీయ విమర్శ కాదు —
ఇది తెలంగాణ ప్రజల గుండె చప్పుడే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *